Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా

Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు ఐదు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది.

FOLLOW US: 

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు ఐదు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు తగ్గాయి. నేడు (మే 29) పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.109.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.97.52గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. పెట్రోల్ ధర రూ.111.49 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.99.52 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.11 పైసలు పెరిగి రూ.112.03 గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు పెరిగి రూ.99.74 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. ముందు రోజుతో పోలిస్తే స్థిరంగా ఉంది. లీటరు ధర రూ.110.48 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా స్థిరంగా ఉంది. రూ.98.27గా  ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.92 పైసలు తగ్గి.. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.111.96 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.86 పైసలు తగ్గి రూ.99.64 గా ఉంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. మే 29 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 113.14 డాలర్ల స్థాయిని చేరింది.

Published at : 29 May 2022 07:20 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Stock Market News: నవ్విన మదుపరి! ఊహించని లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: నవ్విన మదుపరి! ఊహించని లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్

Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్

Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ

Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ల్లో ఏది బెస్ట్?

Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ల్లో ఏది బెస్ట్?

Bad Time For Startups : స్టార్టప్స్‌కు గడ్డు కాలం - వరుసగా ఉద్యోగుల తొలగింపు !

Bad Time For Startups :  స్టార్టప్స్‌కు గడ్డు కాలం - వరుసగా ఉద్యోగుల తొలగింపు !

టాప్ స్టోరీస్

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?