News
News
X

Petrol-Diesel Price, 28 March: భారీగా పెరుగుతున్న ఇంధన ధరలు - ఈ నగరాల్లో నేడు మరీ ఎక్కువగా, తాజా ధరలు ఇవీ

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు కూడా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.57 పైసలు పెరిగి రూ.112.37గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.59 పైసలు పెరిగి రూ.98.69 గా ఉంది.

FOLLOW US: 

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు కూడా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.57 పైసలు పెరిగి రూ.112.37గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.59 పైసలు పెరిగి రూ.98.69 గా ఉంది. ఇక వరంగల్‌లోనూ (Warangal Petrol Price)  నేడు ధరలు కాస్త పెరిగాయి. నేడు (మార్చి 28) పెట్రోల్ ధర రూ.0.75 పైసలు పెరిగి రూ.112.06 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.77 పైసలు పెరిగి  రూ.98.39 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.72 పైసలు పెరిగి నేడు రూ.114.01 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.74 పైసలు పెరిగి రూ.100.22 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.52 పైసలు పెరిగి రూ.114.51గా ఉంది. డీజిల్ ధర రూ.0.54 పైసలు పెరిగి రూ.100.46 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో కూడా పెట్రోల్ ధర నేడు ఎగబాకింది. నేడు లీటరు ధర రూ.0.79 పైసలు పెరిగి రూ.113.34 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా నేడు రూ.0.80 పైసలు పెరిగి రూ.99.33గా అయింది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో పెరిగిన ధరలు (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.59 పైసలు పెరిగి రూ.115.02 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.62 పైసలు పెరిగి నేడు రూ.100.89కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత 70 నుంచి 80 డాలర్ల మధ్య హెచ్చుతగ్గులు ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్చి 27 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 110.36 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

Published at : 28 Mar 2022 07:28 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Digital Rupee: డిజిటల్‌ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!

Digital Rupee: డిజిటల్‌ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!

Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

Petrol-Diesel Price, 10 August: వాహనదారులకు షాక్! నేడు ఎగబాకిన ఇంధన ధరలు - మీ నగరంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 10 August: వాహనదారులకు షాక్! నేడు ఎగబాకిన ఇంధన ధరలు - మీ నగరంలో ఈరోజు ఇలా

Gold-Silver Price: బంగారం నేడు భారీ షాక్! ఊహించని రీతిలో పైకి - వెండి కూడా పైపైకి

Gold-Silver Price: బంగారం నేడు భారీ షాక్! ఊహించని రీతిలో పైకి - వెండి కూడా పైపైకి

India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!

India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!

టాప్ స్టోరీస్

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం