అన్వేషించండి

Petrol-Diesel Price, 28 February: వాహనదారులకు కాస్త ఊరట! ఈ నగరాల్లో తగ్గుదల, క్రూడాయిల్ మాత్రం ఎగబాకుతూ

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి.

గత నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 95 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో (Hyderabad Petrol Price) పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ (Warangal Petrol Price)  నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 28) పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.108.15 గా ఉంది. డీజిల్ ధర రూ.0.18 పైసలు పెరిగి రూ.94.57 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.65 పైసలు పెరిగి రూ.109.76 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.61 పైసలు పెరిగి రూ.96.07 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.73 పైసలు తగ్గి రూ.110.41గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.68 పైసలు తగ్గి రూ.96.47 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర నేడు రూ.0.48 పైసలు తగ్గి రూ.109.40 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.44 పైసలు తగ్గి రూ.95.51గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాజాగా పెరిగాయి.

తిరుపతిలో తగ్గిన ధరలు (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.111.18 వద్ద ఉంది. నేడు లీటరుకు రూ.0.74 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.69 పైసలు పెరిగి రూ.97.16 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఫిబ్రవరి 27 నాటి ధరల ప్రకారం 96.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget