Petrol-Diesel Price, 24 March: రోజురోజుకీ ఇంధన ధరలు పైపైకి - నేడూ అన్నిచోట్లా పెరుగుదల! తాజా ధరలు ఇవీ

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.91 పైసలు పెరిగి రూ.110.01గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.87 పైసలు పెరిగి రూ.96.37 గా ఉంది.

FOLLOW US: 

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో (Hyderabad Petrol Price) పెట్రోల్ డీజిల్ ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.91 పైసలు పెరిగి రూ.110.01గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.87 పైసలు పెరిగి రూ.96.37 గా ఉంది. ఇక వరంగల్‌లోనూ (Warangal Petrol Price)  నేడు ధరలు కాస్త పెరిగాయి. నేడు (మార్చి 24) పెట్రోల్ ధర రూ.0.91 పైసలు పెరిగి రూ.109.69 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.87 పైసలు పెరిగి రూ.96.06 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.01 పైసలు తగ్గి నేడు రూ.111.31 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.03 పైసలు పెరిగి రూ.97.58 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.87 పైసలు పెరిగి రూ.112.10గా ఉంది. డీజిల్ ధర రూ.0.84 పైసలు పెరిగి రూ.98.12 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. నేడు లీటరు ధర నేడు రూ.1.39 పైసలు పెరిగి రూ.111.32 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా నేడు రూ.1.32 పైసలు పెరిగి రూ.97.34గా అయింది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో తగ్గిన ధరలు (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.62 పైసలు పెరిగి రూ.112.68 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.59 పైసలు పెరిగి నేడు రూ.98.59కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత 70 నుంచి 80 డాలర్ల మధ్య హెచ్చుతగ్గులు ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్చి 24 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 116.65 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

Published at : 24 Mar 2022 07:36 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

eMudhra IPO: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్‌ కోటాలో 90% బుక్‌!

eMudhra IPO: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్‌ కోటాలో 90% బుక్‌!

Stock Market News: హ్యాపీ వీకెండ్! రూ.7.5 లక్షల కోట్ల లాభం! సెన్సెక్స్‌ 1534, నిఫ్టీ 471 +

Stock Market News: హ్యాపీ వీకెండ్! రూ.7.5 లక్షల కోట్ల లాభం! సెన్సెక్స్‌ 1534, నిఫ్టీ 471 +

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో జోష్‌! బిట్‌కాయిన్‌ సహా అన్నీ లాభాల్లోనే!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో జోష్‌! బిట్‌కాయిన్‌ సహా అన్నీ లాభాల్లోనే!

Elon Musk: ఎలన్‌ మస్క్‌ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?

Elon Musk: ఎలన్‌ మస్క్‌ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం