By: ABP Desam | Updated at : 21 Sep 2021 06:59 AM (IST)
Edited By: Sai Anand Madasu
పెట్రోల్, డీజిల్ ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత నెల రోజులకు పైగా స్థిరంగానే ఉంటున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా స్థిరత్వమే కొనసాగుతోంది. తెలంగాణలో వరంగల్ నగరంలో కూడా పెట్రోల్ ధరలు నిలకడగానే ఉంటున్నాయి.
తెలంగాణలో సెప్టెంబరు 20న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.26 కాగా.. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.06 పైసలు పెరిగి రూ.105.44గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.96.85కు పెరిగింది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.104.77గానే కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.96.23 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధరలో ఏ మార్పూ కనిపించలేదు. పెట్రోల్ ధర రూ.0.43 పైసలు పెరిగి రూ.107.38 గా కొనసాగుతోంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.40 పైసలు పెరిగి రూ.98.66 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.46 పైసలు తగ్గి.. ప్రస్తుతం రూ.107.69గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.26 పైసలు తగ్గి రూ.98.18కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.25గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.0.22 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.21 పైసలు తగ్గి రూ.97.22గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో స్వల్పంగా తగ్గుదల
తిరుపతిలో ఇంధన ధరలు నిన్నటితో పోల్చితే స్పల్పంగా పెరిగింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.02 పైసలు పెరిగి రూ.107.66 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.03 పైసలు పెరిగి రూ.98.53గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 20 నాటి ధరల ప్రకారం 71.51 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్ ఇదే!
Bitcoin: ప్రభుత్వాల వద్దే ఇన్ని బిట్కాయిన్లు ఉన్నాయా? ఇక టెస్లా వద్దైతే..!
Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?