News
News
X

Petrol-Diesel Price, 19 October: నేడు స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల, తాజా ధరలివే..

విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. ప్రస్తుతం రూ.111.92 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.46 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.40 పైసలు తగ్గి రూ.104.43కి చేరింది.

FOLLOW US: 

కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోనూ నేడు పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.110.09 అయింది. నగరంలో పెట్రోల్ ధర రూ.110 దాటడం ఇదే తొలిసారి. రూ.102.80 గా ఉన్న డీజిల్ ధర స్వల్పంగా పెరిగి.. ప్రస్తుతం రూ.103.18కి చేరింది. డీజిల్ ధర కూడా హైదరాబాద్‌లో ఇదే గరిష్ఠం. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.36 పైసలు పెరిగి రూ.109.61గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.102.71 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజుల క్రితం నిలకడగా ధరలు ఉండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.09 పైసలు తగ్గి.. రూ.109.97గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు తగ్గి రూ.103.05 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.32 పైసలు పెరిగి రూ.111.50 గా ఉంది. డీజిల్ ధర రూ.0.34 పైసలు పెరిగి రూ.104.48 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. ప్రస్తుతం రూ.111.92 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.46 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.40 పైసలు తగ్గి రూ.104.43కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.

విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.90గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.03 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.103.43గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.60 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.17 పైసలు పెరిగి.. రూ.112.39 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.104.84గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగింది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరలే ఇంధన ధరలు ఎగబాకేందుకు కారణంగా తెలుస్తోంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 19 నాటి ధరల ప్రకారం 83.40 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Published at : 19 Oct 2021 06:58 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

EPF interest: ఈపీఎఫ్ ఖాతాల్లో కనిపించని వడ్డీ - క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్‌ మినిస్ట్రీ!

EPF interest: ఈపీఎఫ్ ఖాతాల్లో కనిపించని వడ్డీ - క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్‌ మినిస్ట్రీ!

Stock Market Closing: ఆఖర్లో లాభాల స్వీకరణ - తగ్గిన సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Closing: ఆఖర్లో లాభాల స్వీకరణ - తగ్గిన సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Opening: దసరా జోరు! సెన్సెక్స్‌ 400, నిఫ్టీ 120+ అప్‌!

Stock Market Opening: దసరా జోరు! సెన్సెక్స్‌ 400, నిఫ్టీ 120+ అప్‌!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు