IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Petrol-Diesel Price, 17 March: వాహనదారులకు షాక్! ఈ సిటీల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - క్రమంగా కిందికి క్రూడాయిల్ ధర

Tirupati Petrol Price: తిరుపతిలో లీటరు పెట్రోల్ ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.111.18 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.56 పైసలు పెరిగి నేడు రూ.97.16కి చేరింది.

FOLLOW US: 

గత నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో (Hyderabad Petrol Price) పెట్రోల్ డీజిల్ ధరలు గత రెండు నెలలకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ (Warangal Petrol Price)  నేడు ధరలు కాస్త పెరిగాయి. నేడు (మార్చి 17) పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.108.15 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.18 పైసలు పెరిగి రూ.94.57 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.65 పైసలు పెరిగి నేడు రూ.109.76 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.61 పైసలు పెరిగి రూ.96.07 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.26 పైసలు తగ్గి రూ.110.35గా ఉంది. డీజిల్ ధర రూ.0.24 పైసలు తగ్గి రూ.96.44 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. నేడు లీటరు ధర నేడు రూ.0.85 పైసలు పెరిగి రూ.109.90 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా నేడు రూ.0.79 పైసలు పెరిగి రూ.95.97గా నిలకడగానే ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో తగ్గిన ధరలు (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.111.18 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.56 పైసలు పెరిగి నేడు రూ.97.16కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత 70 నుంచి 80 డాలర్ల మధ్య హెచ్చుతగ్గులు ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్చి 17 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 96.65 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

Published at : 17 Mar 2022 07:12 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్‌! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్‌ రూల్స్‌

Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్‌! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్‌ రూల్స్‌

Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్‌ ఓకే! ఆ రెండో కాయిన్‌ మాత్రం భయపెడుతోంది!

Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్‌ ఓకే! ఆ రెండో కాయిన్‌ మాత్రం భయపెడుతోంది!

Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్‌ 303, నిఫ్టీ 99 డౌన్‌ - ఫెడ్‌ మినిట్స్‌ కోసం వెయిటింగ్‌!

Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్‌ 303, నిఫ్టీ 99 డౌన్‌ - ఫెడ్‌ మినిట్స్‌ కోసం వెయిటింగ్‌!

Top Gainer May 22, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

Top Gainer May 22, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

Top Loser Today May 22, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today May 22, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి