అన్వేషించండి

April Salaries: ఏప్రిల్ ఒకటి నుంచి మీ జీతాలు పెరుగుతాయి -ఎలాగో తెలుసా?

ఏప్రిల్ 1 నుండి, 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను పరిమితి అమలులోకి వస్తుంది, ఇది వారి నెలవారీ ఆదాయాన్ని పెంచుతుంది.

New Income Tax:  దేశంలోని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ  నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను నిబంధనల్లో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం.. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని  ఎంచుకునే వారికి ఇకపై *రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.  గతంలో ఈ పరిమితి రూ. 7 లక్షల వరకు మాత్రమే ఉండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ. 12 లక్షలకు పెంచడం విశేషం. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన జీవుల చేతిలో అదనపు నగదు మిగిలి, వారి కొనుగోలు శక్తి పెరగనుంది.

జీతం తీసుకునే వారికి అదనపు ప్రయోజనం 

కేవలం పన్ను మినహాయింపు పరిమితి పెంపు మాత్రమే కాకుండా, జీతం తీసుకునే ఉద్యోగులకు మరో తీపి కబురు అందింది. గతంలో ఉన్న రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 75,000 కు పెంచారు. దీనివల్ల ఉద్యోగుల పన్ను పరిమితి వాస్తవానికి రూ. 12.75 లక్షల వరకు చేరుతుంది. అంటే, ఒక ఉద్యోగి సంవత్సరానికి రూ. 12.75 లక్షల జీతం పొందుతున్నా, స్టాండర్డ్ డిడక్షన్ , సెక్షన్ 87A కింద లభించే రీబేట్ (రూ. 60,000 వరకు) కలగలిపి నికర పన్ను సున్నా అవుతుంది. ఈ మార్పుల వల్ల సగటున నెలకు సుమారు రూ. 6,600 వరకు అదనంగా పొదుపు చేసుకునే అవకాశం ఉద్యోగులకు కలుగుతుంది.

 కొత్త ఆదాయపు పన్ను స్లాబులు (New Tax Slabs) 
కొత్త పన్ను విధానంలో స్లాబులను మరింత సరళీకృతం చేశారు. అవేమిటంటే 
 రూ. 4 లక్షల వరకు: ఏమీ లేదు (NIL) 
 రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు:  5 శాతం 
 రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు:  10 శాతం
 రూ. 12 లక్షల నుండి రూ. 16 లక్షల వరకు: 15 శాతం 
 రూ. 16 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు:  20 శాతం 
 రూ. 20 లక్షల నుండి రూ. 24 లక్షల వరకు: 25 శాతం 
 రూ. 24 లక్షల కంటే ఎక్కువ: 30 శాతం 

ఎవరికి ఎంత లాభం? 

ఈ కొత్త విధానం వల్ల అధిక ఆదాయం ఉన్న వారికి కూడా గణనీయమైన పన్ను ఆదా అవుతుంది. ఉదాహరణకు, రూ. 16 లక్షల ఆదాయం ఉన్న వారికి సుమారు రూ. 50 వేల వరకు, రూ. 20 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ. 90 వేల వరకు పన్ను ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయోజనాలన్నీ  కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని  ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని, పాత పన్ను విధానంలో (Old Regime) ఉండేవారికి గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని పన్ను నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే ఈ మార్పులు పెరిగిన ధరల నేపథ్యంలో సామాన్యుడికి కొంత ఊరటనిస్తాయని భావిస్తున్నారు.                                               

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget