search
×

Personal Loan : పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి !

పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి !

FOLLOW US: 

Personal Loan :  పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

ఎవరికైనా అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు ఆదుకునే నమ్మకమైన రుణ ఆప్షన్‌గా పర్సనల్‌ లోన్‌ను చెప్పుకోవచ్చు. ఊహించని వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కావచ్చు లేదా ముందుగా ప్లాన్‌ చేసుకున్న సెలవుల కోసం అయ్యే ఖర్చు కావచ్చు, అలాంటి సందర్భాల్లో మంచి క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన వ్యక్తులు ఎంచుకునేందుకు పర్సనల్‌ లోన్‌ మంచి ఎంపిక అవుతుంది. బ్యాంకు లేదా రుణదాత నుంచి పర్సనల్‌ లోన్‌ను చాలా సులువుగా ఎటువంటి చికాకు లేకుండా పొందవచ్చు. కాని, పర్సనల్‌ లోన్‌ కోసం అప్లై చేసే ముందు ఆ రుణం విషయంలో ఉన్న కీలక విషయాలు పూర్తిగా  తెలుసుకొని ఉండాలి.

పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

పర్సనల్‌ లోన్‌ తీసుకోవడానికి ముందు దానికి సంబంధించిన లోతైన అవగాహనను రుణం తీసుకునే వారు కలిగి ఉండాలి:
1. భారీ స్థాయిలో రుణమొత్తం: పెద్ద మొత్తంలో రుణం అందుబాటులో ఉండటం పర్సనల్‌ లోన్స్‌ లో ఉండే ముఖ్యమైన విషయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు మొత్తాలను ఖర్చు చేయకుండా ఇది సాయపడుతుంది. 
2. వేగవంతంగా పంపిణీ: పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే వేగంగా రుణమొత్తం చేతికి అందుతుంది.  అర్హత ప్రమాణాలు కలిగి ఉండటం, మంచి క్రెడిట్‌ స్కోర్‌ కలిగి ఉండటమన్నది  రుణం పంపిణీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది.

3. సులభంగా ఉండే అర్హతా ప్రమాణాలు:  పర్సనల్‌ లోన్‌ పొందేందుకు రుణగ్రహీతలు సులభమైన అర్హతా ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ అర్హతా ప్రమాణాల్లో ఇవి ఉండాలి:

  • దరఖాస్తుదారులు భారతీయులై ఉండాలి.
  • వారి వయస్సు 21 సంవత్సరాల నుంచి 67 ఏళ్ల మధ్యన ఉండాలి.
  • వేతనం పొందే ఉద్యోగులు పేరున్న సంస్థల్లో పనిచేస్తూ స్థిరమైన ఆదాయం కలిగి ఉండాలి.
  • తక్షణ అప్రూవల్‌ పొందేందుకు వ్యక్తులకు సిబిల్‌ స్కోర్‌ 750 లేదా ఆపైన ఉండాలి.

4. సులభమైన డాక్యుమెంటేషన్‌: రుణ దరఖాస్తు ప్రక్రియ వేగంగా, ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించడం ద్వారా రుణగ్రహీతలు సులభంగా రుణ ఆమోదం పొందవచ్చు. ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియలో రుణగ్రహీతలు వేగంగా రుణ మొత్తానికి ఆమోదం పొందేందుకు స్కాన్‌ చేసిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి. 

5. హామీ అవసరం లేదు:  పర్సనల్‌ లోన్‌ అనేది ఒక అసురక్షిత క్రెడిట్‌ ఆప్షన్‌, దీంట్లో రుణగ్రహీతలు తమ ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్ల రుణగ్రహీతలు తమ ఆస్తులు సురక్షితంగా కాపాడుకోవడంతో పాటు సుదీర్ఘమైన ఆస్తి పత్రాల పరిశీలన ప్రక్రియను దూరం పెట్టవచ్చు. కాబట్టి, తక్షణ ఆర్థిక సాయం పొందేందుకు ఇది తగిన ఎంపికగా పరిగణించవచ్చు.

6. ఉపయోగించుకోవడంలో వెసులుబాటు: తీసుకున్న మొత్తాన్ని ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడం పర్సనల్‌ లోన్‌లో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్‌.  వివాహ ఖర్చులు, పిల్లల చదువులు, వ్యాపార విస్తరణ వంటి రకరకాల అవసరాల కోసం శాంక్షన్‌ అయిన డబ్బును రుణగ్రహీతలు ఉపయోగించుకోవచ్చు.

7.సులభమైన రీపేమెంట్‌ వ్యవధి: 60 నెలల విస్తృత రీపేమెంట్‌ గడువుతో పర్సనల్‌ లోన్స్ లభిస్తాయి కాబట్టి రుణగ్రహీతలు సౌకర్యవంతంగా తిరిగి చెల్లింపులు జరపవచ్చు. అయితే ఈ క్రమంలో రుణగ్రహీతలు తమ తిరిగి చెల్లింపు సామర్ధ్యం, తమ ఇతర ఆర్థిక బాధ్యతలకు అనుగుణంగా తగిన పర్సనల్‌ లోన్‌ వ్యవధిని గుర్తించాలి.  

8. అనుకూలమైన వడ్డీ రేటు: అనుకూలమైన పర్సనల్‌ లోన్‌ రేట్స్‌ తో రుణగ్రహీతలు రుణాన్ని పొందవచ్చు కాబట్టి ఈఎంఐలు అనుకూలంగా ఉంటాయి. దీంతో రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణమొత్తాన్ని రీపేమెంట్‌ వ్యవధిలోపు తిరిగి చెల్లించగలుగుతారు. అయితే, రుణ ఖర్చును తగ్గించుకునేందుకు  పర్సనల్‌ లోన్‌పై చక్కని వడ్డీ రేట్లు పొందడం  ఎలా అన్నది రుణగ్రహీతలు తెలుసుకొని ఉండాలి.

పర్సనల్‌ లోన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే 

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ అప్లై చేసేందుకు ఈ సూచనలు మీకు సాయపడతాయి:
1వ దశ: పర్సనల్‌ లోన్‌ అందించే రుణదాతల అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి ప్రొడక్ట్ పేజీ నుంచి పర్సనల్‌ లోన్‌ సెలక్ట్ చేసుకోండి. 
2వ దశ: అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు ఫామ్‌లో అవసరమైన వివరాలన్నీ నింపండి. 
3వ దశ: మీకు కావాల్సిన రుణమొత్తాన్ని ఎంటర్‌ చేసి దాన్ని సబ్మిట్‌ చేయండి

రుణగ్రహీతలు పర్సనల్‌ లోన్‌ కోసం ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌ నుంచి కూడా దరఖాస్తు చేసుకొని తక్షణమే డబ్బును  మరింత సౌకర్యవంతంగా పొందవచ్చు.
దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోవడంతో పాటు పర్సనల్‌ లోన్ కోసం దరఖాస్తు సమయంలో చేసే పొరపాట్లను రుణగ్రహీతలు అర్థం చేసుకోవాలి.
అంతే కాకుండా, వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, క్రెడిట్ కార్డులు మొదలైన అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులపై బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి లెండింగ్ సంస్థలు అందించే ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను రుణగ్రహీతలు పరిశీలించాలి. ఈ ఆఫర్లు లోన్ దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తాయి. రుణం తీసుకోవాలనుకుంటున్న వ్యక్తులు తమ పేరు, సంప్రదించేందుకు వివరాలు అందించి వారికి ఉన్న  ప్రీ-అఫ్రూవ్డ్ ఆఫర్స్ పరిశీలించవచ్చు
మొత్తానికి పర్సనల్ లోన్ అనేది ఒక సరైన ఫైనాన్సింగ్ ఎంపిక. రుణగ్రహీతలకు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తక్షణం  డబ్బు అందించడంలో  సాయపడే ఒక ఉత్తమ ఎంపిక ఇది. కాని, రుణంతో లబ్ది పొందేందుకు పర్సనల్‌ లోన్ విషయాలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అంతే కాదు పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివిధ రుణదాతల ఉత్పత్తులను సరిపోల్చి చూసుకోవాలి.

 

Published at : 22 Aug 2022 03:39 PM (IST) Tags: personal finance Personal Loan

సంబంధిత కథనాలు

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

PMVVY: ఈ బంపర్‌ స్కీమ్‌తో నెలనెలా గ్యారెంటీగా రూ.9 వేలకు పైగా మీ చేతికొస్తుంది

PMVVY: ఈ బంపర్‌ స్కీమ్‌తో నెలనెలా గ్యారెంటీగా రూ.9 వేలకు పైగా మీ చేతికొస్తుంది

Gold Price Today: ఆ ఒక్కటీ మిస్సయితే పసిడి ధర మరింత పడే ఛాన్స్‌!

Gold Price Today: ఆ ఒక్కటీ మిస్సయితే పసిడి ధర మరింత పడే ఛాన్స్‌!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?