By: ABP Desam | Updated at : 06 Feb 2022 06:11 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పీఎన్‌బీ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చింది! సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్లలో కోత పెట్టింది. తగ్గించిన వడ్డీరేట్లు 2022, ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఓ వైపు కస్టమర్లు ఎక్కువ వడ్డీరేట్లను ఆశిస్తోంటే బ్యాంకులేమో కోత పెడుతున్నాయి.
గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.10 లక్షల లోపు నగదు నిల్వ ఉండే సేవింగ్స్ ఖాతాలపై 2.80 శాతం వడ్డీని ఇచ్చేది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్లు ఉండే సేవింగ్స్ ఖాతాలపై 2.85 శాతం వడ్డీని జమ చేసేది. కానీ ఫిబ్రవరి 3 నుంచి ఈ ఖాతాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని సవరించింది.
అంటే ఇప్పుడు రూ.10 లక్షల లోపు ఖాతాలపై 2.75 శాతం, రూ.10 లక్షలకు పైన ఉండే ఖాతాలపై 2.80 శాతం వడ్డీనే పీఎన్‌బీ ఇవ్వనుంది. ఇక రూ.500 కోట్లకు పైగా నిల్వ ఉండే సేవింగ్స్ ఖాతాలపై 3.25 శాతం వడ్డీ ఇస్తోంది. సవరించిన వడ్డీరేట్లు దేశీయ, ఎన్‌ఆర్‌ఐ ఖాతాలకూ వర్తిస్తాయి.
ఫిబ్రవరిలోనే ప్రైవేటు రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్లను సవరించిన సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దేశీయ, ఎన్‌ఆర్‌వో, ఎన్‌ఆర్ఈ సేవింగ్స్ ఖాతాలపై సవరించిన వడ్డీరేట్లను 2022, ఫిబ్రవరి 2 నుంచి అమలు చేస్తోంది. ఇక ఆర్‌బీఎల్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను అమలు చేస్తోంది. పంజాబ్, సింధ్ బ్యాంకు సైతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్లను సవరించడం గమనార్హం.
Also Read: LIC offers: కస్టమర్లకు ఎల్‌ఐసీ ఆఫర్- ఆలస్య రుసుములో భారీ రాయితీ
Also Read: SBI Q3 Results: ఎస్‌బీఐ బంపర్ ప్రాఫిట్! మార్కెట్ అంచనాలు బీట్ చేసిన బ్యాంకు
Need transaction related help? Use UPI-HELP.#DFScelebratesAzadiKaAmritMahotsav #amritmahotsav@amritmahotsav pic.twitter.com/IGXxwnlBPR
— Punjab National Bank (@pnbindia) February 6, 2022
Be a part of a wonderful journey with your Visa Platinum Card.
— Punjab National Bank (@pnbindia) February 6, 2022
Get our PNB Visa Platinum Card and avail vouchers on blinkit and Zomato.
To know more visit: https://t.co/sHkUFdxi4t
Offer valid upto 30th September,22#PNBOffers #PNBVisaPlatinumCard @AmritMahotsav @DFS_India pic.twitter.com/Z7yPMMKFTw
Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్ లేని స్కీమ్స్ ఇవి
Best Picnic Insurance Policy: పిక్నిక్ ప్లాన్ చేసే ముందు ఇన్సూరెన్స్ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Gold-Silver Prices Today 05 Nov: నగలు కొనేవాళ్లకు కలిసొస్తున్న కాలం, తగ్గిన పసిడి రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold-Silver Prices Today 04 Nov: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల ధరలు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఇవీ
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం