By: Arun Kumar Veera | Updated at : 23 Feb 2024 12:09 PM (IST)
ఎన్‌పీఎస్ లాగిన్ రూల్ మారింది
NPS Update: మీ ఎన్‌పీఎస్ (National Pension System) అకౌంట్‌లోకి లాగిన్ కావాలా?, ఇప్పుడు ఈ పని మరికొంత కఠినంగా & భద్రంగా మారింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ రక్షణ పొరను 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) మరో అంచె పెంచింది.
NPSలో పెరిగిన సెక్యూరిటీ ఫీచర్
NPS CRA (Central Record Keeping Agency) సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యే సమయంలో, ఆధార్ ఆధారిత ధృవీకరణను (Aadhaar based authentication) తప్పనిసరిగా మార్చారు. ఇప్పుడు, CRA సిస్టమ్‌లోకి లాగిన్ కావడానికి టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two-Factor Authentication - 2FA) ఉంటుంది. కొత్త భద్రత చర్యలు 01 ఏప్రిల్ 2024 నుంచి అమలులోకి వస్తాయి. దీనికి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ సర్క్యులర్ కూడా జారీ చేసింది.
ఆధార్ ఆధారిత లాగిన్ పద్ధతిని లింక్ చేయడం వల్ల లాగిన్ ఫ్రేమ్‌వర్క్ మరింత బలంగా మారుతుందని ఆ సర్క్యులర్‌లో PFRDA పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్త సంస్థల్లో NPS కార్యకలాపాలకు ఇది సురక్షితమైన వ్యవస్థను సృష్టిస్తుందని వెల్లడించింది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను PFRDA నియంత్రిస్తుంది. PFRDA సర్క్యులర్ ప్రకారం.. ఇప్పటికే ఉన్న యూజర్ ఐడీ & పాస్‌వర్డ్ ఆధారిత లాగిన్ ప్రక్రియతో ఆధార్ ఆధారిత ధృవీకరణ అనుసంధానం అవుతుంది. ఫలితంగా.. సీఆర్‌ఏ సిస్టమ్‌లోకి లాగిన్ కావడం టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తర్వాత మాత్రమే వీలవుతుంది.
ప్రస్తుతం, పాస్‌వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్‌ను యాక్సెస్ చేసి, తద్వారా ఎన్‌పీఎస్ లావాదేవీలు చేస్తున్నారు. కొత్త స్టెప్ వల్ల NPS వ్యవస్థ రక్షణ కవచంలోకి మరో బలమైన పొర వచ్చి చేరుతుందని PFRDA వెల్లడించింది. అన్ని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు దీనికి సంబంధించి SoP (Standard operating Procedure) జారీ చేస్తాయి.
2024 ఫిబ్రవరి నుంచి కొత్త నిబంధనలు (New Rules for withdrawal of money from NPS account)
NPS అకౌంట్ నుంచి పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి (partial withdrawal of pension) కొత్త రూల్స్ జారీ అయ్యాయి. 2024 ఫిబ్రవరి 01వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.
2024 ఫిబ్రవరి 01 నుంచి, NSP ఖాతాలో ఉన్న డబ్బులో యజమాన్యం వాటాను మినహాయించి, చందాదార్లు కట్టే వాటా నుంచి మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలి. అది కూడా 25 శాతం మించకుండా ఉపసంహరించుకోవడానికే అనుమతి ఉంటుంది. అలాగే, కాంట్రిబ్యూషన్ మీద వచ్చే వడ్డీ ఆదాయాన్ని పాక్షికంగా వెనక్కు తీసుకునే అవకాశం లేదు.
కొత్త నిబంధన ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల కోసం మాత్రమే NPS ఖాతా నుంచి డబ్బును పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇస్తారు. అవి:
- పిల్లల ఉన్నత చదువుల కోసం. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తింపు.
- పిల్లల వివాహ ఖర్చుల కోసం. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు వర్తింపు.
- చందాదారు పేరిట ఇల్లు కట్టుకోవడం లేదా కొనడానికి. జాయింట్ ఓనర్‌షిప్ కూడా కవర్ అవుతుంది. ఇండివిడ్యువల్ హౌస్ లేదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు ఇది వర్తిస్తుంది. పూర్వీకుల ఆస్తి కాకుండా, సబ్‌స్క్రైబర్‌కు ఇప్పటికే నివాస ఆస్తి ఉంటే పెన్షన్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.
- దీర్ఘకాలిక/ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చుల కోసం. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, కొవిడ్-19 ఇతర పెద్ద స్థాయి జబ్బులు ఈ పరిధిలోకి వస్తాయి.
- చందాదారుకు అవయవ వైకల్యం ఉండి, దానికి అవసరమైన వైద్య ఖర్చుల కోసం.
- స్టార్టప్ లేదా కొత్త వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు.
- నైపుణ్యం పెంచుకోవడానికి
మరో ఆసక్తికర కథనం: పసిడి వెలుగు స్థిరం, వెండి వెలవెల - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే!
Gold-Silver Prices Today 12 Jan: ఈ రోజు గోల్డ్, సిల్వర్ నగల రేట్లు ఇవీ - మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయంటే!
Credit Card- UPI: మీ క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి ఈజీగా లింక్ చేయండి, సింపుల్‌గా పే చేయండి
Budget Expectations: వాహన రంగానికి కావాలి వరాలు - నిర్మలమ్మ కనికరిస్తే భారీగా తగ్గుతుంది బండి రేటు!
Gold-Silver Prices Today 11 Jan: గోల్డ్ షాపింగ్ చేసేవాళ్లకు గొప్ప ఊరట - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Budget Expectations: హోమ్ లోన్‌పై ప్రత్యేక పన్ను రాయితీ, రూ.5 లక్షల వడ్డీ వరకు 'జీరో టాక్స్'!
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Daaku Maharaj Collection Day 1: 'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్లో బాలయ్య అరుదైన రికార్డు