By: ABP Desam | Updated at : 10 Mar 2023 02:24 PM (IST)
Edited By: Arunmali
ఒకే పెట్టుబడితో మంచి వడ్డీ ఆదాయం + పన్ను ఆదా
Tax Saving Tip: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) గడువు మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన మొత్తానికి ఆదాయ పన్ను కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కష్టపడి సంపాదించిన మొత్తంలో కొంతభాగాన్ని పన్నుల రూపంలో వదులుకోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ బాధ నుంచి తప్పించుకోవాలంటే, పన్ను ఆదా మార్గాల గురించి తెలుసుకోవాలి.
దేశంలోని ప్రతి ఆదాయ వర్గం కోసం వివిధ రకాల పొదుపు పథకాలను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. వాటిలో పెట్టుబడి పెట్టడం సురక్షితమే కాదు, మంచి రాబడిని కూడా పొందవచ్చు. వాటిలో కొన్ని పథకాలు ఆదాయ పన్ను చెల్లించాల్సిన బాధ్యత నుంచి మిమ్మల్ని పక్కకు తప్పిస్తాయి. అలాంటి పథకాల్లో ఒకదాని పేరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Saving Certificate - NSC).
NSC పథకంలో 7% వడ్డీ ఆదాయం
మీరు NSC పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఆ పనిని చాలా సులభంగా చేయవచ్చు. దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా ఈ స్కీమ్‌లో జాయిన్ కావచ్చు. పైగా, కేంద్ర ప్రభుత్వం ఈ పథకం వడ్డీ రేట్లను ఇటీవలే పెంచింది. డిసెంబర్ 2022 వరకు, ఈ పథకం కింద 6.8 శాతం వడ్డీ రేటును పెట్టుబడిదార్లకు అందించారు, ఇప్పుడు అది 7 శాతానికి పెరిగింది.
పన్ను ఆదా ప్రయోజనం
మీరు ఆదాయ పన్ను మినహాయింపు పొందాలనుకుంటే, ఈ నెలే చివరి అవకాశం. కాబట్టి, మార్చి 31 లోపు ఒక పన్ను ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. NSCలో పెట్టుబడి ద్వారా మంచి రాబడితో పాటు, పన్ను ఆదా ప్రయోజనాన్ని (Tax Saving Benefit) కూడా మీరు పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులకు, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు లభిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
మీరు కేవలం వెయ్యి రూపాయలతో, ఈ పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకంలో (Post Office Small Savings Scheme) పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు, మీకు సాధ్యమైనంత మొత్తాన్ని జమ చేయవచ్చు. ప్రజలు FD కంటే ఈ పథకంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, కొన్ని బ్యాంకుల FD రేట్ల కంటే NSCలో ఎక్కువ రాబడి లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ సమయం 5 సంవత్సరాలు.
NSCలో మూడు రకాల ప్లాన్స్
1. మీరు ఈ పథకంలో ఒంటరిగా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్లు కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
2. ఇద్దరు పెట్టుబడిదార్లు కలిసి ఉమ్మడి పద్ధతిలో ఈ సర్టిఫికేట్ కొనుగోలు చేయవచ్చు.
3. మూడవ మార్గంలో.. ఇద్దరు వ్యక్తులు కలిసి పెట్టుబడి పెట్టి, ఒక వ్యక్తికి మాత్రమే డబ్బు తీసుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి: 18 ఏళ్లకు టాటా గ్రూప్ నుంచి ఐపీవో - TCS తర్వాత మళ్లీ ఇదే
Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి
Fraud alert: పేమెంట్ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్!
Fixed Deposits: భారీ వడ్డీని అందించే స్పెషల్ FDలు ఇవి, ఇదే చివరి అవకాశం
Gold-Silver Price 21 March 2023: పసిడి ధర భారీగా పతనం, అయినా హైరేంజ్‌లోనే రేటు
SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!