By: Arun Kumar Veera | Updated at : 22 Jan 2025 03:22 PM (IST)
వజ్రాలు కొనేప్పుడు చెక్ చేయాల్సిన విషయాలు ( Image Source : Other )
Things to check when buying diamonds: భారతీయులకు బంగారం & వజ్రాభరణాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రత్యేక సందర్భాల్లో విలువైన వస్తువును బహుమతిగా ఇవ్వడం అనేది వాళ్లపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తీకరించే సంప్రదాయం. బంగారు నగలు కొంటే, దాని విలువ పెరుగుతుందేగానీ తగ్గదు. వజ్రాల విషయంలో అలా కాదు. కొనేముందు, వజ్రాల దీర్ఘకాలిక విలువను ప్రభావితం చేసే అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మన మనస్సులో రెండు విషయాలు మెదులుతాయి. ఒకటి ధర, రెండోది డిజైన్. వజ్రాభరణాలు కొనడం చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి డిజైన్ & ధరకు మించి ఆలోచించాలి. మీరు కొనే వజ్రాభరణాల నిజమైన విలువను గుర్తించడానికి ఈ విషయాలు తెలుసుకోవాలి.
4Cలను అర్థం చేసుకోవాలి
వజ్రాల విలువను నాలుగు ప్రాథమిక అంశాల ఆధారంగా లెక్కిస్తారు:
కట్: ఒక వజ్రం కాంతిని ఎలా ప్రతిబింబించగలదో & ఎంత ప్రకాశించగలదో నిర్ణయించే కీలక అంశం ఇది. చక్కగా కట్ చేసిన వజ్రం మరింత మెరుస్తుంది.
క్లారిటీ: ఇది, అంతర్గత లేదా బాహ్య లోపాలను సూచిస్తుంది. తక్కువ లోపాలు ఉంటే అధిక స్పష్టత & అధిక విలువ ఉంటాయి.
కలర్: వజ్రాలు రంగులేకుండానే కాకుండా కొన్ని రకాల లేత రంగుల్లోనూ లభిస్తాయి. రంగు లేని వజ్రాలు అరుదుగా ఉంటాయి & విలువైనవి.
క్యారెట్: ఇది వజ్రం పరిమాణానికి సూచిక. పెద్ద వజ్రాలు ఖరీదైనవి. అయితే, దాని పరిమాణం కోసం నాణ్యతలో రాజీ పడకూడదు.
GII సర్టిఫికేషన్
మీరు మొదటిసారి వజ్రం లేదా వజ్రాభరణం కొనుగోలు చేస్తుంటే, చెల్లింపు చేసే ముందు సర్టిఫికేషన్‌ను చెక్ చేయడం ముఖ్యం. సర్టిఫైడ్ డైమండ్ లేదా వజ్రాభరణాలను మాత్రమే కొనుగోలు చేయండి. ఈ సర్టిఫికేషన్ మీ వజ్రం ప్రామాణికత & విలువను నిర్ధారిస్తుంది, భవిష్యత్ ఆస్తిని సృష్టిస్తుంది. జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (GII) వంటి ప్రఖ్యాత ప్రయోగశాలలు వజ్రం నాణ్యతపై వివరణాత్మక నివేదికలను అందిస్తాయి.
సహజ వజ్రాలు Vs ప్రయోగశాల వజ్రాలు
ప్రయోగశాల తయారీ వజ్రాలు (Lab-Grown Diamonds) చూడడానికి సహజంగా దొరికే వజ్రాలలాగే ఉంటాయి, ఇంకా తక్కువ ధరకు లభిస్తాయి. అయితే, వాటి రీసేల్ వాల్యూ సాధారణంగా తక్కువగా ఉంటుంది. మీ ప్రాధాన్యతలు & పెట్టుబడి లక్ష్యాలను గుర్తు పెట్టుకుని ఏ రకమైన వజ్రం మీకు సరిపోతుందో నిర్ణయించుకోవాలి.
ప్రఖ్యాత బ్రాండ్స్
ప్రముఖ ఆభరణాల వ్యాపారుల నుంచి వజ్రాభరణాలను కొనుగోలు చేయడం వల్ల నమ్మకం & నాణ్యత లభిస్తాయి. కొన్ని బ్రాండ్స్ సహజ వజ్రాలను విక్రయించడానికి గ్లోబల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాయి.
బైబ్యాక్ పాలసీ
వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు బైబ్యాక్ పాలసీ చూడడం కూడా కీలకం. మీరు ఎప్పడైనా వజ్రాభరణాన్ని తిరిగి అమ్మితే, మీకు లభించే ధర శాతం, వర్తించే షరతులు వంటివి బైబ్యాక్ పాలసీలో ఉంటాయి.
ఆభరణాల బీమా
వజ్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ గురించి పట్టించుకోరు. దొంగతనం, పోగొట్టుకోవడం లేదా నష్టం వంటి వాటి నుంచి భద్రత కోసం మీ ఆభరణాలకు బీమా చేయడం తెలివైనది. చాలా బ్రాండ్స్ ఆభరణాల కొనుగోలు సమయంలో ఉచిత బీమా ఆప్షన్లు అందిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ అధిక సుంకాలు విధిస్తే మన దేశం రియాక్షన్ ఎలా ఉండాలంటే?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025- పెద్ద ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్- వీడియో వైరల్
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్ మంజూరు!