search
×

Gold Jewellery Selling Tips: బంగారం అమ్ముతున్నారా? అయితే ఈ ఎనిమిది పాయింట్లు చదవండి

ఇంట్లో.. డబ్బు అవసరం వస్తుంది. చేతిలో డబ్బులు ఉండవు.. బంగారం అమ్మాలనుకుంటారు. తొందరలో అమ్మేస్తే.. మెుదటికే మోసం వస్తుంది. కాస్త ఆచితూచి.. ఆలోచించి అమ్మాలి. అందుకోసం కొన్ని పాయింట్లు ఫాలో అయితే మంచిది.

FOLLOW US: 
Share:

ఫైనాన్షియల్ ప్లానింగ్ లో గోల్డ్ అనేది చాలా ముఖ్యం. ఎమర్జెన్సీ సమయంలో డబ్బులు కావాలంటే.. బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం.. లేదా అమ్మడం చేస్తుంటాం. కరోనా పరిస్థితుల్లో ఆర్ధిక అవసరాల కోసం కొంత మంది బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఎలా పడితే అలా అమ్మేసి.. తర్వాత తల పట్టుకుంటే లాభం ఉండదు. అమ్మే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి.. నాణ్యత విషయాన్ని ముందే చూసుకోవాలి. ఎలాంటి షాపులోకి వెళ్లి అమ్మాలో ముందే ఒక ఐడియా ఉంటే మంచిది. తర్వాత వెనక్కు చూసుకుంటే లాభం ఉండదు. షాపు నుంచి ఒక్కసారి బయటకొచ్చాక మళ్లీ పట్టించుకునే పరిస్థితులు తక్కువే. 

  • బంగారం అమ్మడానికి వెళ్లే ముందు బరువు, స్వచ్ఛతను తెలుసోకోండి. కొనుగోలు చేసినప్పుడు షాపులో ఇచ్చే రశీదులను దాచుకోవడం మంచిది. మళ్లీ అమ్మే సమయంలో ఉపయోగపడతాయి.
  • పొరపాటున మీరు తీసుకున్న రశీదు పోతే.. ప్రస్తుతం ఉన్న బరువు, స్వచ్ఛతను పరీక్షించి రశీదు తీసుకోండి.
  • ఒకే దుకాణంలో కాకుండా నాలుగైదు షాపులకు వెళ్లీ కొటేషన్ తీసుకుంటే మంచిది. బంగారం ధ‌ర‌ను నిర్ణ‌యించేందుకు స్టాండ‌ర్డ్ విధానాలు లేవు. అందువ‌ల్ల వేరు వేరు దుకాణాల్లో కొటేష‌న్ తీసుకుంటే లాభం.
  • బంగారం అమ్మాలనుకున్న సమయంలో దాని స్వచ్ఛత గురించి కొన్నిసార్లు మీకు కచ్చితంగా తెలియకపోవచ్చు. క్యారెట్ మీటర్ అందుబాటులో ఉన్న షాపుల వద్ద స్వచ్ఛతను పరీక్షించండి. బంగారు నగ‌ల‌పై ఉండే హాల్‌మార్కింగ్ గుర్తు దాని స్వ‌చ్ఛత‌ను తెలియ‌జేస్తుంది. కొనేవారు అటువంటి ఆభ‌ర‌ణాల‌ను కొనేందుకు ఆసక్తి చూపుతారు.
  •  ఆభ‌రణాలు అమ్మాల‌న్నా, పాత న‌గ‌ల‌కు బ‌దులుగా కొత్త‌వి తీసుకోవాల‌న్నా .. గ‌తంలో ఆ ఆభ‌రాల‌ను కొనుగోలు చేసిన దుకాణం దగ్గరకు వెళ్తే మంచిది. కొన్ని దుకాణాలు, వారి వ‌ద్ద కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి కొనుగోలు చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటే లాభం జరగొచ్చు. 
  • చిన్న చిన్న దుకాణాలు, తెలియ‌ని వారు మోసాలకు పాల్ప‌డే అవ‌కాశం ఉంది. న‌మ్మ‌క‌మైన దుకాణాల వ‌ద్ద గానీ, బ్రాండ్‌ షాపుల‌కు గానీ వెళ్ల‌డం మంచిది. 
    ధ‌ర చెప్పే ముందు, ఆభ‌ర‌ణాల బ‌రువులో నిర్ణీత శాతాన్ని వేస్టేజ్ కింద త‌గ్గిస్తారు.
  • విక్ర‌యించే ముందు ఎంత శాతం వెస్టేజ్ రూపంలో పోతుందో తెలుసుకోవాలి. కొంత మంది  న‌గల మొత్తం బ‌రువులో 20 శాతం వ‌ర‌కు వేస్టేజీ కింద తీసివేసి ఆ మొత్తాన్ని త‌గ్గించి ఇస్తారు. రాళ్లు ఉన్న ఆభ‌ర‌ణాల‌కు ఎక్కువ వేస్టేజీ లెక్కిస్తారు. 
  • ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసేప్పుడు మీరు చెల్లించిన త‌యారీ డబ్బులు, అమ్మేటప్పుడు తిరిగి రావు.
Published at : 16 Jul 2021 03:34 PM (IST) Tags: gold rate tips for gold gold

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్‌ లేని స్కీమ్స్‌ ఇవి

Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్‌ లేని స్కీమ్స్‌ ఇవి

Best Picnic Insurance Policy: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Best Picnic Insurance Policy: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

టాప్ స్టోరీస్

PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?

PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?

Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్

Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్

Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు

Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు

Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు