By: ABP Desam | Updated at : 08 Aug 2021 07:58 PM (IST)
బంగారం అమ్మే ముందు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఆర్థిక ప్రణాళికలో బంగారం ముఖ్యమైనది. చేతిలో డబ్బులు ఉండవు.. ఉన్న బంగారం అమ్మి డబ్బులు తీసుకొచ్చుకోవాలని అనుకుంటాం. కానీ బంగారం అమ్మేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అవసరాల కోసం కొంతమంది బంగారాన్ని అమ్మాలి అనుకుంటారు. అమ్మేముందు కొన్ని జాగ్రత్తలు గుర్తుపెట్టుకుంటే మంచిది.
అమ్మే ముందు బంగారం బరువు, స్వచ్ఛతను తెలుసుకోండి. కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రశీదులను భద్రపరుచుకోవడం మంచిది. ఇలాంటి సమయంలో ఉపయోగపడతాయి.
ఒకే దుకాణంలో కాకుండా నాలుగైదు షాపులకు వెళ్లీ కొటేషన్ తీసుకుంటే మంచిది. బంగారం ధరను నిర్ణయించేందుకు స్టాండర్డ్ విధానాలు లేవు. అందువల్ల వేరు వేరు దుకాణాల్లో కొటేషన్ తీసుకుంటే లాభం.
బంగారం అమ్మాలనుకున్న సమయంలో దాని స్వచ్ఛత గురించి కొన్నిసార్లు మీకు కచ్చితంగా తెలియకపోవచ్చు. క్యారెట్ మీటర్ అందుబాటులో ఉన్న షాపుల వద్ద స్వచ్ఛతను పరీక్షించండి. బంగారు నగలపై ఉండే హాల్‌మార్కింగ్ గుర్తు దాని స్వచ్ఛతను తెలియజేస్తుంది. కొనేవారు అటువంటి ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతారు.
ఆభరణాలు అమ్మాలన్నా, పాత నగలకు బదులుగా కొత్తవి తీసుకోవాలన్నా .. గతంలో ఆ ఆభరాలను కొనుగోలు చేసిన దుకాణం దగ్గరకు వెళ్తే మంచిది. కొన్ని దుకాణాలు, వారి వద్ద కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి కొనుగోలు చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటే లాభం జరగొచ్చు.
చిన్న చిన్న దుకాణాలు, తెలియని వారు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. నమ్మకమైన దుకాణాల వద్ద గానీ, బ్రాండ్ షాపులకు గానీ వెళ్లడం మంచిది.
ధర చెప్పే ముందు, ఆభరణాల బరువులో నిర్ణీత శాతాన్ని వేస్టేజ్ కింద తగ్గిస్తారు.
విక్రయించే ముందు ఎంత శాతం వెస్టేజ్ రూపంలో పోతుందో తెలుసుకోవాలి. కొంత మంది నగల మొత్తం బరువులో 20 శాతం వరకు వేస్టేజీ కింద తీసివేసి ఆ మొత్తాన్ని తగ్గించి ఇస్తారు. రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజీ లెక్కిస్తారు.
ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు మీరు చెల్లించిన తయారీ డబ్బులు, అమ్మేటప్పుడు తిరిగి రావు. రశీదులు లేకపోయినా ప్రస్తుతం ఉన్న బరువు, స్వచ్ఛతను పరీక్షించి రశీదు తీసుకోండి.
తుది ధర చెప్పే ముందు, ఆభరణాల బరువులో నిర్ణీత శాతాన్ని వేస్టేజ్ కింద తగ్గిస్తారని గుర్తుంచుకోవాలి. విక్రయించే ముందు ఎంత శాతం వెస్టేజ్ రూపంలో పోతుందో తెలుసుకోవాలి. కొంత మంది నగల మొత్తం బరువులో 20 శాతం వరకు వేస్టేజీ కింద తీసివేసి ఆ మొత్తాన్ని తగ్గించి ఇస్తారు. రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజీ లెక్కిస్తారు.
ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు మీరు చెల్లించిన తయారీ రుసుములు, విక్రయించేటప్పుడు తిరిగి రావన్న విషయాన్ని గుర్తించాలి.
Silver Price: వెండి మెరుపు ముందు వెలవెలబోయిన బంగారం, స్టాక్ మార్కెట్! ఏడాదిలో 130% కంటే ఎక్కువ పెరుగుదల!
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్
Sivaji Comments : శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
Bangladesh Violence: తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!
Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?