By: Arun Kumar Veera | Updated at : 22 Dec 2024 10:36 AM (IST)
దిగువ మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజల కోసం కొత్త పథకం ( Image Source : Other )
Non-Collateral Housing Loan: తన కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకోని వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండడు. ఇల్లు అంటే నాలుగు గోడలు, పైకప్పు మాత్రమే కాదు.. అది ఒక కుటుంబం మొత్తానికి ఆర్థికంగా & మానసికంగా భరోసాను ఇస్తుంది. చాలా రకాల టెన్షన్లను దూరం చేస్తుంది. అయితే, సొంత ఇల్లు కొనే స్థోమత మన దేశంలోని మెజారిటీ ప్రజలకు లేదు. వీరిలో చాలా మంది, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి గృహ రుణం తీసుకుంటున్నారు. హోమ్ లోన్ పొందడం అంత సులభమేమీ కాదు. పేపర్ వర్క్‌తో చాలా తలనొప్పి ఉంటుంది. ఆస్తి పత్రాలను రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ దగ్గర తనఖా పెట్టాలి. లోన్ మొత్తం తీరిస్తేనే తిరిగి ఆ పత్రాలు ఇంటి యజమాని చేతికి వస్తాయి.
పెద్ద బంగ్లా లేదా విలాసవంతమైన ఫ్లాట్ అవసరం లేదు, సాధారణ ఇల్లు ఉన్నా చాలు అని మీరు కోరుకుంటే... ఇకపై అలాంటి ఇంటిని పొందడం సులభంగా మారబోతోంది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, సామాన్యుల సొంత ఇంటి కలను నిజం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా, దిగువ మధ్య తరగతి ఆదాయ వర్గాల (Lower middle class income groups) ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్‌ను రూపొందిస్తోంది. ఇది అమల్లోకి వస్తే, దిగువ మధ్య తరగతి వర్గంలో ఉన్న కోట్లాది మంది లబ్ధి పొందుతారు.
కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్ ప్రత్యేకత ఏంటి?
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ప్రజలు తీసుకునే 20 లక్షల రూపాయల వరకు హౌసింగ్ లోన్‌లో, కొత్త పథకం కింద కొంత మొత్తానికి భారత ప్రభుత్వం గ్యారెంటీ (Government of India Guarantee) ఇస్తుంది. దీని కోసం ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. అంటే.. ఇంటి ఆస్తి పేపర్లను బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ దగ్గర తనఖా పెట్టాల్సిన అవసరం (Non-collateral housing loan) ఉండదు. గృహ రుణ ఆమోదం మొత్తం డిజిటల్ లావాదేవీల రూపంలో జరుగుతుంది. కొత్త పథకం అమల్లోకి వస్తే, ఒక ఇంటికి యజమాని కావాలన్న కోట్లాది ప్రజల ఆకాంక్ష నెరవేరే కొత్త మార్గం కనిపిస్తుంది. జీరో కొలేటరల్ హౌసింగ్ లోన్ (Zero Collateral Housing Loan)ను దృష్టిలో పెట్టుకుని రూపొందిచే ఈ పథకంలో పేపర్ వర్క్‌ను కూడా గణనీయంగా తగ్గుతుంది. థర్డ్ పార్టీ హామీ అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
30 సంవత్సరాల వరకు రుణం
ప్రజలకు గృహ రుణాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పరిశ్రమల వ్యవస్థాపకులకు త్వరగా రుణాలు అందించడానికి భారత ప్రభుత్వం "క్రెడిట్ గ్యారెంటీ ఫండ్" (Credit Guarantee Fund) తీసుకోబోతోంది. తక్కువ ఆదాయ వర్గాల ప్రజల కోసం డిజైన్ చేసే కొత్త హౌసింగ్ లోన్ పథకం పేరును "క్రెడిట్ రిస్క్ గ్యారెంటీ ఫండ్" (Credit Risk Guarantee Fund) అని పెట్టే అవకాశం ఉంది. దీని కోసం వివిధ పరిష్కారాలను పరిశీలిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో దీనిని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ స్కీమ్ కింద 30 ఏళ్ల కాల పరిమతి హౌసింగ్ లోన్ (30-year tenure housing loan)ను పరిశీలిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొత్త పథకం కింద, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కంటే సులభమైన నిబంధనలతో గృహ రుణం దొరుకుతుంది.
మరో ఆసక్తికర కథనం: పిల్లల ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా, చట్టం ఏం చెబుతోంది?
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!