Paytm Shares Down: అమ్మో పేటీఎం!! మళ్లీ 13 శాతం పతనమైన షేరు ధర.. కారణం ఇదే!
యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ పిరియడ్ ముగియడంతో పేటీఎంపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. వారంతా షేర్లను విక్రయించేందుకే మొగ్గు చూపుతుండటంతో షేరు ధర 13 శాతం పడిపోయింది.
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం షేరు ధర మరింత పడిపోయింది! యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ పిరియడ్ ముగియడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. వారంతా షేర్లను విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
బుధవారం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ షేరు ధర 13 శాతం పడిపోయింది. యాంకర్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో ఉదయం రూ.1269 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇష్యూ ధర రూ.2150తో పోలిస్తే మొత్తంగా 27 శాతానికి పైగా ధర పతనమైంది. నవంబర్ 22 నుంచి చూస్తే స్టాక్ 18 సెషన్లలో 13 సార్లు నష్టాల్లోనే ట్రేడ్ అయింది. కాగా బుధవారం మధ్యాహ్నం పేటీఎం షేరు రూ.1250 వద్ద ట్రేడ్ అవుతుండటం గమనార్హం.
పేటీఎం ఎక్కువ మార్కెట్ విలువతో ఐపీవోకు రావడమే నష్టాలకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. అయితే షేర్ల ధర కంపెనీ నిజమైన అవకాశాలు, లాభదాయకతని ప్రతిబింబించవని పేటీఎం స్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొంటున్నారు. ఈ మధ్యే కంపెనీ గ్రాస్ మర్చండైజ్ విలువ (GMV) రెండు రెట్లు పెరిగి రూ.166,600 కోట్లకు చేరుకుంది. అధికంగా రుణాలు ఇవ్వడమే ఇందుకు కారణం. గతేడాది సంస్థ జీఎంవీ రూ.2,800 కోట్లుగా ఉండటం గమనార్హం. పేటీఎంకు ఈ మధ్యే ఆర్‌బీఐ షెడ్యూలు బ్యాంకు హోదా ఇచ్చింది.
ఏదేమైనా పేటీఎం ఇంకా నష్టాల్లోనే కొనసాగుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.473 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.437 కోట్లుగా ఉంది. ఆపరేషన్స్ రాబడి రెండో త్రైమాసికంలో రూ.1086 కోట్లుగా ఉండగా గతేడాది రూ.664గా ఉంది. 64 శాతం వృద్ధి నమోదు చేసింది.
Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!
Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి