Paytm Payments Bank: పేటీఎం మరో ఘనత..! షెడ్యూలు బ్యాంకు హోదా ఇచ్చిన ఆర్బీఐ
వినియోగదారులకు నిక్కచ్చిగా సేవలందిస్తూ, సరిగ్గా నిబంధనలను పాటించే బ్యాంకులకు షెడ్యూలు హోదా ఇచ్చే అధికారం రిజర్వు బ్యాంకుకు ఉంటుంది. తాజాగా పేటీఎంకు షెడ్యూలు బ్యాంకు హోదా ఇచ్చింది.
పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) మరో ఘనత సాధించింది! రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 'షెడ్యూలు బ్యాంక్' హోదా అందుకుంది. ఫలితంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు, నగదు బదిలీ, రెపో రేట్, రివర్స్ రెపోరేటు, వడ్డీరేట్ల మార్పులు చేసేందుకు వీలుంటుంది. బహుశా ఒక డిజిటల్ బ్యాంకుకు షెడ్యూలు హోదా రావడం ఇదే మొదటిసారి కావొచ్చు!
వినియోగదారులకు నిక్కచ్చిగా సేవలందిస్తూ, సరిగ్గా నిబంధనలను పాటించే బ్యాంకులకు షెడ్యూలు హోదా ఇచ్చే అధికారం రిజర్వు బ్యాంకుకు ఉంటుంది. ఆర్‌బీఐ చట్టం-1934 ప్రకారం ఆర్‌బీఐ సంతృప్తి చెందితే చట్టంలోని రెండో షెడ్యూలులో చేర్చొచ్చు. ఒక షెడ్యూలు పేమెంట్ బ్యాంక్‌గా ఇప్పుడు పేటీఎం మరిన్ని వ్యాపార అవకాశాలను అన్వేషించొచ్చు. కొత్తగా విస్తరించొచ్చు.
ప్రభుత్వ పథకాలు, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్, ప్రాథమిక వేలం, స్థిర రేటు, చర రెపోరేటు, రివర్స్ రెపోరేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వంటివి పేటీఎం చేపొట్టొచ్చు. ఆర్థిక సమ్మిళత పథకాల్లో భాగస్వామి కావొచ్చు. షెడ్యూలు బ్యాంకు హోదా లభించినందుకు పేటీఎం సంతోషం వ్యక్తం చేసింది. ఇందుకోసం తాము నిరంతరం కృషి చేశామని వెల్లడించింది.
'భారతీయులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు మేం నిరంతరం శ్రమిస్తున్నాం. ఆర్థిక సమ్మిళిత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. దేశంలో సరికొత్త బ్యాంకింగ్ యుగాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. డిజిటల్ బ్యాంకింగ్‌ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రిజర్వు బ్యాంకు రెండో షెడ్యూలులో చేరడం మేము మరిన్ని వినూత్నమైన ఆవిష్కరణలు చేసేందుకు ప్రేరణ కల్పించనుంది. దేశంలో బ్యాంకు సేవలు పొందలేకపోతున్న, తక్కువ పొందుతున్న వారికి మేం మరింత చేరువవుతాం' అని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సతీశ్ కుమార్ గుప్తా అన్నారు.
Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?
Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!
Also Read: Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Indian Mobile Congress 2021: మెరుపు వేగంతో దేశంలో 5Gని ప్రవేశపెట్టాలన్న ముకేశ్ అంబానీ
Also Read: Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇది.!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి