అన్వేషించండి

Paytm Down: పొద్దున్నే పేటీఎం డౌన్‌! డబ్బులు నష్టపోయిన యూజర్లు!!

Paytm Down: ఏదైనా అవసరం కోసం ఉదయాన్నే పేటీఎం ఓపెన్‌ చేశారా? యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే అవ్వలేదా? ఈ సమస్యల్ని ఎదుర్కొంది మీరొక్కరే కాదు!

Paytm App Down:  ఏదైనా అవసరం కోసం ఉదయాన్నే పేటీఎం ఓపెన్‌ చేశారా? యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే అవ్వలేదా? అకస్మాత్తుగా యాప్‌ లాగౌట్‌ అయిందా? తిరిగి లాగిన్‌ చేయడానికి ఇబ్బంది పడ్డారా? పేటీఎం మనీ యాప్‌ ఓపెన్‌ చేస్తుంటే పేటీఎం పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయమని అడిగిందా? అయితే ఈ సమస్యల్ని ఎదుర్కొంది మీరొక్కరే కాదు! దేశవ్యాప్తంగా చాలామంది యూజర్లు ఇవే ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే!

సేవలకు అంతరాయం

దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం పేటీఎం సేవలకు అంతరాయం కలిగింది. యాప్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేస్తూ వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. అకౌంట్‌ దానంతట అదే లాగౌట్‌ అయిందని కంపెనీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు సైతం బదిలీ అవ్వలేదని పేర్కొన్నారు. పేటీఎం కస్టమర్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కంపెనీ వివరణ ఇవ్వక తప్పలేదు.

నెట్‌వర్క్‌ ఎర్రర్‌

యాప్‌లో నెట్‌వర్క్‌ తప్పిందం వల్ల సాంకేతిక సమస్య ఎదురైనట్టు పేటీఎం తెలిపింది. చాలామంది యూజర్లు లాగిన్‌ సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొంది. చెల్లింపులు చేయలేకపోయారని వివరించింది. 'పేటీఎం యాప్‌లో నెట్‌వర్క్‌ ఎర్రర్‌ వల్లే పేటీఎం మనీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ లాగిన్‌ అయ్యేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ సాంకేతిక సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కాగానే అప్‌డేట్‌ చేస్తాం' అని పేటీఎం తెలిపింది.

డౌన్‌ డిటెక్టర్‌ ధ్రువీకరణ

పేటీఎం యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతిని డౌన్‌ డిటెక్టర్‌ సైతం ధ్రువీకరించింది. ముబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో సమస్య ఎక్కువగా ఉందని వివరించింది. శుక్రవారం ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య సమస్య తీవ్రత ఎక్కువగా కనిపించిందని వెల్లడించింది.

ఫిర్యాదుల వెల్లువ

'పేటీఎం మనీ పనిచేయకపోవడం వల్ల చాలా డబ్బు నష్టపోయాను. నేను కొనుగోలు చేసిన స్టాక్‌ రోజువారీ గరిష్ఠ స్థాయిని చేరుకొంది. సాంకేతిక సమస్య వల్ల అమ్మలేకపోయాను' అని ఓ యూజర్‌ ఫిర్యాదు చేశారు. 'చాలా సేపటి నుంచి పేటీం యాప్‌ డౌన్‌ అయింది' అని మరొకరు అన్నారు. 'పేటీఎం మనీలో సమస్యల వల్ల మేం నష్టాలను ఎదుర్కొంటున్నాం. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. వారి లైసెన్స్‌ రద్దు చేయాలి' అని ఒక యూజర్‌ పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Nita Mukesh Ambani Anant Ashray: అనాథలకోసం కర్జాత్‌లో 100 ఎకరాల టౌన్‌షిప్‌.. నీతా అంబానీ కొత్త ప్రాజెక్ట్.
పుట్టినరోజుకు అద్భుతమైన అర్థమిచ్చిన నీతా అంబానీ.. అనాథలకోసం అనంత్ ఆశ్రయ్ టౌన్‌షిప్
Alphabet Stock Crash: చరిత్రలోనే తొలిసారిగా అల్ఫాబెట్‌ షేర్లు భారీ పతనం.. ఒకే రోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు!
చరిత్రలోనే తొలిసారిగా అల్ఫాబెట్‌ షేర్లు భారీ పతనం.. ఒకే రోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Embed widget