Patanjali Banking ERP: బ్యాంకింగ్‌లోకి అడుగుపెట్టిన పతంజలి.. డిజిటల్ బ్యాంకింగ్‌లో సరికొత్త విధానం
Patanjali in Banking: పతంజలి గ్రూప్ కొత్త రంగాల్లోకి అడుగుపెడుతోంది. డిజిటల్ బ్యాంకింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులతో పతంజలి సంస్థ బ్యాంకింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

Patanjali ERP System: పతంజలి గ్రూప్ బ్యాంకింగ్ రంగంలోకి వచ్చేసింది. సంస్థ టెక్నాలజీ బ్రాంచ్, బారువా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ BSPL AI ఆధారిత మల్టీ లాంగ్వేజ్ 360° ERP (Enterprise Resource Planning) విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో సరికొత్త సంచలనానికి నాంది పలికామని పతంజలి ప్రకటించింది. గ్రామీణ, సహకారం, చిన్న తరహా ఆర్థిక సంస్థలను ఈ కొత్త టెక్నాలజీలో భాగం చేస్తున్నామని చెప్పింది.
“బారువా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ CBS ప్లాట్ ఫామ్ ( B-Banking) అనేది బ్యాంకింగ్ రంగంలో సమ్మిళిత ఎకో సిస్టమ్ రూపొందించడంలో ఎదురవుతున్న నాలుగు కీలకమైన అడ్డంకులను పరిష్కరించగలుగుతుందని” పతంజలి తెలిపింది.
భాషా అనుసంధానం
భారత అనేక భాషల సమాహారం అయినప్పటికీ ఇప్పుటకీ బ్యాంకింగ్ రంగం ప్రాంతీయ భాషలను ఇముడ్చుకోవడంలో చాలా వెనుకబడింది. చాలా వరకూ కార్యకలాపాలన్నీ ఇంగ్లిషులోనే జరుగుతున్నాయి. BSPL రెండు భాషల పరిష్కారం ఇప్పుడు వినియోగదారులకు మరింత సులువైన బ్యాంకింగ్ సేవలు అందించనుంది. కస్టమర్లు ఇంగ్లిషులోనూ.. తమ స్థానిక భాషల్లోనూ బ్యాంకింగ్ సేవలు పొందగలుగుతారు.
భద్రత మరింత కట్టుదిట్టం.
ఈ కొత్త ERPలో భద్రతకు మరింత ప్రాధాన్యత ఇచ్చారు. నూతన AI టూల్స్, సమర్థమైన సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వల్ల ఖాతాదారుల డేటా, లావాదేవీలు, డిజిటల్ సంప్రదింపులు మరింత భద్రంగా ఉంటాయి.
నాణ్యమైన సేవలు
బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం, వేగవంతం కూడా అవుతాయి. ఎండ్ టూ ఎండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల మొత్తం బ్యాంకింగ్ విధానంలో మార్పులు వస్తాయి. API బ్యాంకింగ్, MIS, HRMS, ERP మాడ్యూల్స్, AML టూల్స్ అందుబాటులోకి వస్తాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలు మొత్తం ఆటోమేషన్ లోకి వెళతాయి.
నిబంధనలకు కట్టుబడి ఉండటం
అధికార భాషా చట్టం 1963 చట్టం, అలాగే సుప్రీంకోర్టు ఉత్తర్వులను పూర్తిగా అమలు పరిచే దిశలో ఆర్థిక సంస్థల్లో ద్విభాషా సాప్ట్‌వేర్ ఉపకరిస్తుంది. ఈ సాప్ట్‌వేర్ సాయంతో ప్రభుత్వ ఉత్తర్వులను కచ్చితంగా పాటించినట్లు అవుతుంది. సమ్మిళిత సాంకేతికత అభివృద్ధికి పతంజలి గ్రూప్ కట్టుబడి ఉందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎండీ ఆచార్య బాలకృష్ణ అన్నారు. “ భారత్ బహుభాషల దేశం, ఇప్పటికీ బ్యాంకింగ్ రంగంలో ప్రాథమిక కార్యకలాపాలు కూడా ఇంగ్లిషులోనే జరుగుతండటం వల్ల కింది స్థాయి వాళ్లకు ఈ సేవలు అందడం లేదు. భరువా సోల్యూషన్ సమూల మార్పును తీసుకొచ్చిన ప్రొడక్టు. సాంకేతికంగా చాలా ఉన్నతమైనది. సమగ్రమైంది. అలాగే అన్ని భాషలను తనలో ఇముడ్చుకుంది. అధికార భాషా చట్టానికి అనుగునంగా పనిచేస్తుంది.”
బ్యాంకింగ్ రంగంలో నూతన విప్లవం- ఆచార్య బాలకృష్ణ
పతంజలిన ఆవిష్కరణ బ్యాంకింగ్ రంగంలో కీలకమైన మార్పునకు దోహదం చేస్తుందని ఆచార్య బాలకృష్ణ అన్నారు. ఈ AI , మెషిన్ లెర్నింగ్ యుగంలోమన గ్రామీణ, పట్టణ, సహకార, చిన్న ఆర్థిక సంస్థలకు కూడా అదే స్థాయి సాంకేతికత అందుబాటులోకి రావాలి. ఈ ప్రయత్నం అన్నది భారత్ సంవృద్ధిలో ఓ కీలక ముందడుగు. దీనిని సాకారం చేయడం కోసం భరువా సొల్యూషన్స్ నేచురల్ సపోర్ట్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామి అవుతోంది. ఈ సంస్థ పాతికేళ్లుగా ద్విభాషా సాప్ట్‌వేర్ రూపకల్పనలోనూ.. బ్యాంకింగ్ రంగంలో ALM, LOS,MIS ఉత్పత్తులను తీసుకురావడంలోనూ కృషి చేసింది. 1999 నుంచి దాదాపు 5000 బ్యాంకింగ్ బ్రాంచ్‌లలో ఈ ఉత్పత్తులు తీసుకొచ్చారు
BSPL లక్ష్యం ఏంటి..?
భరువా, నేషనల్ సపోర్ట్ కన్సల్టెన్సీ బ్యాంకింగ్ సేవల్లో సమూల మార్పులకు కృషి చేయనున్నాయి. ఒక సమగ్రమైన బ్యాంక్ ఇన్ బాక్స్ సోల్యూషన్ తీసుకురానున్నారు. వినియోగదారులు సేవలు అందించే ఫ్రంట్ ఎండ్ మరింత సులభతరంగా ఉండేందుకు బ్యాక్ ఎండ్‌లో చాలా శక్తివంతమైన బ్యాంకింగ్ ఇన్ఫ్రా ఏర్పాటు చేస్తారు. ఇది కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ CBS తో అనుసంధానం అవుతుంది. అలాగే ఇతర బ్యాకింగ్ సపోర్టింగ్ సర్వీసులైన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, AI ఆధారిత సెర్చ్, eKYC, CKYC, PFMS, SMS బ్యాంకింగ్, KCC IS portal, AML, HRMS, CSS, MIS, DSS and ERP, HRMS, etc, వంటి బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌లు చేస్తారు.
ఇది గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని NBFCలు , అర్బన్ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు, జిల్లా సహకార బ్యాంకులకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇతర భారతీయ భాషల కార్యకలాపాలు అవసరం అయిన చోట ఎక్కువుగా అవసరం ఉంటుంది.





















