అన్వేషించండి

Tech Layoffs: రోజుకు 1600 మందికి పింక్‌ స్లిప్‌, ప్రొఫెషనల్స్‌ను వెళ్లగొడుతున్న టెక్‌ కంపెనీలు

2022లో, 1,000 కంపెనీలు 1,54,336 మంది సిబ్బందిని శాశ్వతంగా ఇళ్లకు పంపేశాయి.

Tech Layoffs: టెక్నాలజీ రంగానికి ఇది బాగా గడ్డుకాలం. ఆర్థిక మాంద్యం కారుమేఘాలు కమ్ముకొస్తుండడంతో.. ముందు జాగ్రత్తగా కొన్ని నెలల నుంచీ టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇస్తున్నాయి. కొత్త నియామకాల్లోనూ వేగం బాగా తగ్గించాయి.

2023 జనవరిలో ఇప్పటి వరకు చూస్తే... భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 1,600 మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ "Layoffs.fyi" నుంచి వచ్చిన డేటా ప్రకారం, 2022లో, 1,000 కంపెనీలు 1,54,336 మంది సిబ్బందిని శాశ్వతంగా ఇళ్లకు పంపేశాయి.

టాప్‌ ప్లేస్‌లో ఇండియన్‌ కంపెనీలు
2022లో కనిపించిన భారీ టెక్‌ లేఆఫ్స్‌ కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. భారతీయ కంపెనీలు & స్టార్టప్‌లు తమ సిబ్బందిని తొలగించడంలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి.

స్వదేశీ సోషల్‌ మీడియా కంపెనీ 'షేర్‌చాట్' (ShareChat - (Mohalla Tech Pvt Ltd), అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇది, 500 మందికి పైగా ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసింది.

డిసెంబర్ 2022లో, తన Jeet11 ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను మూసేసిన ShareChat, దాని ఉద్యోగులలో దాదాపు 5 శాతం మందిని తీసేసింది.

ఓలా (Ola - ఇది 200 మంది ఉద్యోగులను తొలగించింది), వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ Skit.ai వంటి కంపెనీలు కూడా ఈ నెలలో ఉద్యోగులను తొలగించి వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి.

స్వదేశీ క్విక్‌ గ్రోసరీ డెలివరీ ప్రొవైడర్ డంజో (Dunzo) కూడా ఖర్చు తగ్గింపు చర్యలకు దిగి, తన వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందికి ఉద్వాసన పలికింది.

2023 సంవత్సరం ప్రారంభం నుంచీ ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్కర్లను లేఆఫ్‌ పీడకలలు వెంటాడుతున్నాయి. జనవరి నెల మొదటి 15 రోజుల్లోనే ఇప్పటి వరకు 91 కంపెనీలు 24,000కు పైగా టెక్ ఉద్యోగాల్లో కోతలు పెట్టాయి. రాబోయే రోజులు మరింత అధ్వాన్నంగా ఉండవచ్చన్న దానికి ఇది ఒక సూచన.

భారతదేశంలో దాదాపు 1,000 మంది సిబ్బంది సహా ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ (Amazon) ప్రకటించింది.

లింక్డ్‌ఇన్‌ది భిన్న వైఖరి
ఈ కంపెనీలు అన్నింటికీ విరుద్ధంగా లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రవర్తిస్తోంది. ఈ కంపెనీ కొత్త ఉద్యోగుల వేటలో ఉంది. ఇతర కంపెనీల నుంచి ఉద్వాసనకు గురైన వాళ్లకు రెడ్‌ కార్పెట్‌ వేసి ఆహ్వానం పలుకుతోంది. అనిశ్చిత ఆర్థిక వాతావరణం కారణంగా అనేక కంపెనీలు వాటి శ్రామిక శక్తిని తగ్గిస్తుంటే, మెడ మీద కత్తి వేలాడుతున్న ఉద్యోగులకు కెరీర్ సలహాలు కూడా ఇస్తోంది. ఉద్యోగ జీవితంలో ఎదరయ్యే ఇలాంటి అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలను లింక్డ్‌ఇన్‌ సూచిస్తోంది.

మార్కెట్ పరిశోధన సంస్థ సెన్సార్ టవర్ (Sensor Tower) రిపోర్ట్‌ ప్రకారం.. 2022లో లింక్డ్‌ఇన్ యాప్ ప్రపంచవ్యాప్తంగా 58.4 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ను సాధించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల ద్వారా ఈ డౌన్‌లోడ్స్‌ జరిగాయి. 2021 సంవత్సరంలో డౌన్‌లోడ్స్‌తో పోలిస్తే, 2022లో ఈ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 10 శాతం పెరిగాయి.

టాప్ హెడ్ లైన్స్

July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
EPFO: ఇంట్లోనే ఉండి మీ PF ఖాతా మొబైల్ నంబర్‌ మార్చుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
ఇంట్లోనే ఉండి మీ PF ఖాతా మొబైల్ నంబర్‌ మార్చుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Donald Trump Avenue In Hyderabad: హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
Embed widget