(Source: ECI/ABP News/ABP Majha)
SBI FD Account Online: ఇంట్లో కూర్చొనే SBI FD అకౌంట్ తెరవండి, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, చాలా సింపుల్!
ప్రజల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో నగదును ఆకర్షిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
SBI FD Account Online: గత కొన్ని నెలలుగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), రికరింగ్ డిపాజిట్లు (RD), సేవింగ్స్ (SB) అకౌంట్స్ మీద వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఈ స్కీముల మీద వడ్డీ రేట్లను పెంచింది. డిపాజిట్ రేట్లలో నిరంతర పెరుగుదల కారణంగా, తమ డబ్బును బ్యాంకుల్లో FDలు చేయడానికి పెట్టుబడిదారులు, ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇటీవల, (అక్టోబర్ 22, 2022న) 2 కోట్ల రూపాయల కంటే తక్కువ FDల మీద చెల్లించే వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్ల మేర స్టేట్ బ్యాంక్ పెంచింది.
మీకు కూడా ఇలాంటి ప్రయోజనం కావాలంటే SBIలో ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరవాలి. ఇందుకోసం బ్యాంక్ బ్రాంచ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారా, ఇంట్లో కూర్చునే SBI FD ఖాతా తెరవొచ్చు. మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు. SBI నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి పని పూర్తి చేయవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
1. ఆన్‌లైన్ ద్వారా SBI FD ఖాతాను తెరవడానికి, ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో, పర్సనల్ బ్యాంకింగ్ అని కనిపిస్తుంది. దాని పక్కనే "కంటిన్యూ టు లాగిన్" బటన్ ఉంటుంది.
2. "కంటిన్యూ టు లాగిన్" బటన్ మీద నొక్కితే, మరొక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కనిపిస్తున్న మొదటి బాక్స్‌లో మీ యూజర్ నేమ్, రెండో బాక్స్‌లో పాస్‌వర్డ్, మూడో బాక్స్‌లో క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మూడో బాక్స్ కిందే క్యాప్చా కోడ్ ఉంటుంది. దాన్ని యథాతథంగా మూడో బాక్స్‌లో టైపు చేయాలి. కాపీ చేయడం కుదరదు. మూడు బాక్సుల్లో వివరాలు నింపిన తర్వాత క్యాప్చా కోడ్ కింద కనిపిస్తున్న "లాగిన్" బటన్ మీద క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీకు 8 అంకెల వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. సంబంధింత బాక్స్‌లో దానిని ఎంటర్ చేసి "సబ్మిట్" మీద క్లిక్ చేయాలి. ఆ వెంటనే మీ పర్సనల్ అకౌంట్‌లోకి మీరు లాగిన్ అవుతారు. హోమ్ పేజీలోని డిపాజిట్ స్కీమ్ ఆప్షన్‌ను ఇప్పుడు ఎంచుకోండి.
4. ఆ తర్వాత, టర్మ్ డిపాజిట్‌ను ఎంచుకుని, e-FD మీద క్లిక్ చేయండి.
5. దీని తర్వాత, మీరు తెరవాలనుకుంటున్న FD ఖాతా రకాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత "ప్రొసీడ్" బటన్ మీద క్లిక్ చేయండి
6. ఇప్పుడు.. ఏ ఖాతా నుంచి డబ్బులు తీసి, FD ఖాతాలో జమ చేయాలని అనుకుంటున్నారో, ఆ ఖాతాను ఎంచుకోండి.
7. దీని తర్వాత FD ప్రిన్సిపల్ వాల్యూని పూరించండి. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే, ఆ ఆప్షన్ కూడా ఎంచుకోండి.
8. దీని తర్వాత, మీరు FD కాల పరిమితి (మెచ్యూరిటీ) తేదీని ఎంచుకోండి.
9. చివరగా, బ్యాంక్ ప్రతిపాదించే అన్ని నిబంధనలు, షరతులకు మీరు ఒప్పుకుంటున్నట్లు కనిపించే బాక్స్‌లో టిక్ పెట్టాలి.
10. ఇప్పుడు మీరు "సబ్మిట్" బటన్‌ను నొక్కగానే వెంటనే మీ ఆన్‌లైన్ FD ఖాతా ఓపెన్ అవుతుంది.
రూ.2 కోట్ల కంటే తక్కువ FDలపై SBI వడ్డీ రేటు
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన రెగ్యులర్ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ FDలపై 3.00% నుంచి 6.10% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. వీటిలో.. 2 నుంచి 3 సంవత్సరాల FDలకు ఈ వడ్డీ 6.25% గరిష్ట వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. 1 సంవత్సరం FD మీద 6.10% వడ్డీ రేటు అందుబాటులో ఉంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇచ్చే రేటు కంటే.. మహిళలు, వృద్ధులకు 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5% ఎక్కువ వడ్డీని స్టేట్ బ్యాంక్ అందిస్తోంది.