Paytm Q1 Results: నష్టాలు తగ్గించి నమ్మకం నిలబెట్టుకున్న పేటీఎం, Q1లో బిజినెస్ బజ్
పేటీఎం సంపాదించిన ఆదాయం కూడా YoYలో భారీగా పెరిగింది.
Paytm Q1 Results: 2023 ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో, ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం ఏకీకృత నికర నష్టం అతి భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని నష్టం రూ. 644 కోట్లతో పోలిస్తే, ఈసారి రూ.357 కోట్ల లాస్ పోస్ట్ చేసింది. అయితే, మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ. 168 కోట్లతో పోలిస్తే నష్టం పెరిగింది.
పేటీఎం సంపాదించిన ఆదాయం కూడా YoYలో భారీగా పెరిగింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.1,680 కోట్ల నుంచి 39% జంప్‌తో రూ. 2,342 కోట్లకు చేరింది.
పేటీఎం Q1 FY24 రిజల్ట్స్:
- Q1లో కంట్రిబ్యూషన్ ప్రాఫిట్ సంవత్సరానికి (YoY) దాదాపు 80% పెరిగి రూ. 1,304 కోట్లుగా లెక్క తేలింది. ఇందులో మార్జిన్ 56%.
- EBITDA రూ.84 కోట్లకు మెరుగుపడింది, ఎబిటా మార్జిన్ 4%. కాంట్రిబ్యూషన్ మార్జిన్, ఆపరేటింగ్ లీవరేజీ దీనిని డ్రైవ్ చేశాయి.
- జూన్ త్రైమాసికంలో పేటీఎం పేమెంట్స్ బిజినెస్ బాగా సాగింది. ఈ సెగ్మెంట్ ఆదాయం YoYలో 31% పెరిగి రూ.1,414 కోట్లకు చేరుకుంది.
- పేటీఎం రిజల్ట్స్‌లో కీలకంగా చూడాల్సిన 'గ్రాస్ మర్చండైస్ వాల్యూ' (GMV) 37% పెరిగి రూ.4.05 లక్షల కోట్లుగా లెక్క తేలింది.
- నెట్ పేమెంట్ మార్జిన్ భారీగా 69% YoY పెరిగి రూ. 648 కోట్లకు చేరుకుంది. పేమెంట్ ప్రాసెసింగ్ మార్జిన్ 7-9 bps రేంజ్‌లో ఉంది.
- పేటీఎం డివైజ్‌లకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. వాటి కోసం వ్యాపారుల సబ్‌స్క్రిప్షన్ 79 లక్షలకు చేరుకుంది. ఇది YoYలో 41 లక్షలు, QoQలో 11 లక్షల పెరిగింది.
- IPLకి సంబంధించిన మార్కెటింగ్ ఖర్చులు పెరగడం, సేల్స్ & టెక్నాలజీ టీమ్‌ల విస్తరణ కారణంగా పేటీఎం పరోక్ష ఖర్చులు ఊహించిన విధంగా 22% పెరిగాయి.
- కస్టమర్ బేస్ పెంచుకునేందుకు మార్కెటింగ్‌లో పెట్టుబడులు కొనసాగిస్తామని కంపెనీ ప్రకటించింది.
- Q1లో, ఈ ప్లాట్‌ఫామ్ లెండింగ్ బిజినెస్ అతి భారీగా పెరిగింది, రూ. 14,845 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. YoYలో ఇది 167% వృద్ధి.
- కంపెనీలో క్యాష్ బ్యాలెన్స్ మార్చి నాటి రూ. 8,275 కోట్ల నుంచి జూన్ చివరి నాటికి రూ. 8,367 కోట్లకు పెరిగింది.
శుక్రవారం ట్రేడింగ్‌లో పేటీఎం షేర్లు 1% నష్టంతో రూ.842.85 వద్ద ముగిశాయి.
మరో ఆసక్తికర కథనం: తగ్గిన రిలయన్స్ లాభం, కొంప ముంచిన కోర్ బిజినెస్, ₹9 డివిడెండ్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial