అన్వేషించండి

Nominee Rules: బ్యాంకుల్లో కొత్త నామినీ రూల్స్.. నిర్మలా సీతారామన్ నిర్ణయం వెనుక కారణం ఇదే..!

News Rules : భారతీయ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు నిరంతరం పెరుగుతూనే ఉండటంపై కేంద్ర ప్రభుత్వం తన దృష్టిని సారించింది.

Bank Nominee Rules: మోదీ సర్కార్ మెుదటి టర్మ్ వచ్చినప్పటి నుంచి దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా నుంచి డిజిటల్ చెల్లింపులను దేశమంతటా విస్తరించటం వరకు అనేక మార్పులకు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తీసుకొచ్చాయి. అయితే ఈ సారి అనేక ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ క్రమంలో వాస్తవానికి దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలకు సంబంధించిన అన్ క్లెయమ్డ్ డిపాజిట్లు నిరంతరం పెరగటంపై ఈసారి మోదీ సర్కార్ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం మార్చి 31, 2024 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన బ్యాంకుల వద్ద ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. ఈ సొమ్ము ఏటేటా పెరగటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తమ పూర్వీకులకు సంబంధించిన అన్ క్లెయిమ్ డిపాజిట్లను చట్టబద్దమైన వారసులు తీసుకునేందుకు వెసులుబాటు సైతం కల్పించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సమస్య రావటానికి కారణం బ్యాంకులు దశాబ్ధాల కిందట నామినీ, కేవైసీ వివరాలు వంటి వాటిని ఇప్పటి మాదిరిగా పాటించకపోవటమేనని గ్రహించింది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు తాజా బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లు, 2024లో ఒక ఖాతాకు కస్టమర్లు నలుగురు నామినీలను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. దీనికి ముందు వరకు ఒక ఖాతాకు కేవలం ఒక నామినీని మాత్రమే కస్టమర్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త చట్టాలు అమలులోకి వస్తే తదనుగుణంగా నామినీలను నివియోగదారులు పెంచుకోవచ్చు. ఇది సదరు ఖాతాదారులు మరణించిన సమయంలో చట్టపరంగా డిపాజిట్లు లేదా ఇతర మెుత్తాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి పొందుపరచబడిన నామినీలకు అవకాశం కల్పించబడుతుంది. ఇది భారీగా పెరుగుతున్న అన్ క్లెయిమ్డ్ డబ్బు పెరుగుదలను నివారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నమ్ముతోంది. 

ఈ క్రమంలో శుక్రవారం లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశగా కొందరు విపక్ష సభ్యులు ఈ బిల్లును సభలో వ్యతిరేకించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏకకాలంలో 4 చట్టాలను సవరించాలని ప్రయత్నించటాన్ని ఆర్ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది గత సాంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వారు వారించారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, బ్యాంకింగ్ కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని సవరణలను ప్రతిపాదించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ రేటు ఎంత?బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
GST On Cancer Drugs: కేన్సర్‌ మందుల నుంచి చిరుతిళ్ల వరకు రేట్లు భారీగా తగ్గుతున్నాయ్‌! ఎందుకంటే?
కేన్సర్‌ మందుల నుంచి చిరుతిళ్ల వరకు రేట్లు భారీగా తగ్గుతున్నాయ్‌! ఎందుకంటే?
CM Chandrbabu: సాధారణ స్థితికి విజయవాడ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సాధారణ స్థితికి విజయవాడ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Prakasam News: ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన
ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన
Janhvi Kapoor : ఈసారి జాన్వీ వయ్యారం ఓణి కాదు చీర కట్టింది..  దేవర ప్రమోషన్స్​లో దేవకన్య వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
ఈసారి జాన్వీ వయ్యారం ఓణి కాదు చీర కట్టింది.. దేవర ప్రమోషన్స్​లో దేవకన్య వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
Embed widget