News
News
వీడియోలు ఆటలు
X

Nexus Trust: నెక్సస్‌ ట్రస్ట్‌ IPO ప్రారంభం, బిడ్‌ వేసే ముందు బుర్రలో పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు

ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆఫర్‌ ఓపెన్‌లో ఉంటుంది.

FOLLOW US: 
Share:

Nexus Select Trust REIT IPO: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ప్రధాన ట్రస్ట్‌లలో ఒకటైన నెక్సస్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌ REIT IPO ఇవాళ (మంగళవారం, 09 మే 2023‌) ప్రారంభం అయింది. IPO ప్రారంభానికి ఒక రోజు ముందు, సోమవారం నాడు యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా సుమారు రూ. 1,440 కోట్లను సమీకరించింది. మొత్తం 20 మంది యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించింది. ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం, యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు రూ. 100 చొప్పున మొత్తం 14.39 కోట్ల షేర్లను జారీ చేసింది.

నెక్సస్‌ సెలెక్ట్ ట్రస్ట్ IPOలో పాల్గొన్న యాంకర్‌ ఇన్వెస్టర్లు.. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రూసిక్ యాసిడ్ యూనిట్ ఫండ్ Plc, IIFL ఇన్‌కమ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌, మోర్గాన్ స్టాన్లీ ఆసియా, సెగంటి ఇండియా మారిషస్, HDFC ట్రస్టీస్‌, ICICI ప్రుడెన్షియల్, NPS ట్రస్ట్, SBI జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఘిసాలో మాస్టర్ ఫండ్ LP మొదలైన కంపెనీలు ఉన్నాయి.

IPO ప్రైస్‌ బ్యాండ్‌
ఒక్కో షేరుకు రూ. 95 - 100ను IPO ప్రైస్‌ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధర శ్రేణిలో పెట్టుబడిదార్లు బిడ్స్‌ వేయవచ్చు, ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆఫర్‌ ఓపెన్‌లో ఉంటుంది.

పెట్టుబడిదార్లు కనీసం 150 షేర్లకు బిడ్‌ వేయాలి, ఇంకా కావాలంటే 150 గుణిజాల్లో బిడ్స్‌ వేయవచ్చు. అంటే 150 షేర్లు లేదా 300 షేర్లు (150 x 2) లేదా 450 షేర్లు (150 x 3) లేదా 600 (150 x 4)  షేర్లు ఇలా లాట్స్‌ రూపంలో బిడ్స్‌ దాఖలు చేయాలి.

ఈ IPO ద్వారా 3,200 కోట్ల రూపాయలను సేకరించేందుకు Nexus సెలెక్ట్ ట్రస్ట్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో, 1400 కోట్ల రూపాయల విలువైన తాజా/ప్రైమరీ షేర్లను జారీ చేస్తుంది. మిగిలిన 1800 కోట్ల రూపాయలకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా సెకండరీ షేర్లను అమ్మకానికి పెడుతోంది.

ఈ నెల 19న లిస్టింగ్‌కు అవకాశం
IPOలో 75% వాటాను సంస్థాగత పెట్టుబడిదారుల కోసం కంపెనీ రిజర్వ్ చేసింది. విజయవంతమైన బిడ్డర్లకు షేర్ల కేటాయింపు ఈ నెల 16 నాటికి ఖరారవుతుంది. ఈ నెల 19న లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది.

కంపెనీ వ్యాపారం
17 హై క్వాలిటీ అసెట్స్‌తో కూడిన భారతదేశపు అతి పెద్ద మాల్ ప్లాట్‌ఫామ్ Nexus సెలెక్ట్ ట్రస్ట్‌. దిల్లీ (సెలెక్ట్ సిటీవాక్), నవీ ముంబై (నెక్సస్ సీవుడ్స్), బెంగళూరు (నెక్సస్ కోరమంగళ), చండీగఢ్ (నెక్సస్ ఎలాంటే), అహ్మదాబాద్ (నెక్సస్ అహ్మదాబాద్ వన్) సహా 14 ప్రముఖ జనసమ్మర్ధ నగరాల్లో ఇది విస్తరించి ఉంది. వాటి మొత్తం విస్తీర్ణం 9.8 మిలియన్ చదరపు అడుగులు కాగా, విలువ రూ. 23,000 కోట్లు.

నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పోర్ట్‌ఫోలియోలోని 17 ఆస్తుల్లో 96% ప్రాంతాన్ని లీజుకు ఇచ్చారు. జర, హెచ్&ఎం, యునిక్లో, సెఫోరా, సూపర్‌డ్రీ, లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి ఫేమస్‌ స్టోర్లు సహా దాదాపు 3,000 స్టోర్లు ఈ మాల్స్‌లో ఉన్నాయి. ఆపిల్‌ వంటి 1,100 పైగా జాతీయ & అంతర్జాతీయ బ్రాండ్‌లు ఇక్కడ అమ్ముడవుతున్నాయి.

బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేస్తున్న మూడో REIT ఇది. భారతదేశంలో మొట్టమొదటి REIT ఎంబసీ ఆఫీస్ పార్క్స్‌ను బ్లాక్‌స్టోన్ మొదట ప్రారంభించింది. ఆ తర్వాత మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REITని ప్రారంభించింది. ఇవి రెండూ ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అయి ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 09 May 2023 12:58 PM (IST) Tags: IPO Price Band Blackstone IPO dates Nexus Select Trust

సంబంధిత కథనాలు

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో కరెన్సీ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో కరెన్సీ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Aakash IPO: బైజూస్‌ ఆకాశ్‌ ఐపీవో తేదీ మార్పు! వచ్చే ఏడాదికి మార్చిన బోర్డు!

Aakash IPO: బైజూస్‌ ఆకాశ్‌ ఐపీవో తేదీ మార్పు! వచ్చే ఏడాదికి మార్చిన బోర్డు!

Stock Market News: బుల్‌రన్‌ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!

Stock Market News: బుల్‌రన్‌ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!

Banking Services Unavailable: హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్‌!

Banking Services Unavailable: హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్‌!

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ