By: ABP Desam | Updated at : 20 Jul 2022 02:30 PM (IST)
రోజురోజుకూ తగ్గుతున్న నెట్ ఫ్లిక్స్ యూజర్లు, 9.7 లక్షల మంది ఔట్!
Netflix Users: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గుతూనే ఉంది. వరుసగా రెండు త్రైమాసికాల్లోనూ ఈ ఓటీటీ దిగ్గజం తన వినియోగదారులను కోల్పోవడం యాజమాన్యాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. రెండో త్రైమాసికం ఆదాయ ప్రకటనను విడుదల చేయగా.. అందులో చందాదారులు కోల్పోయినట్లు వెల్లడైంది. సబ్ స్క్రైబర్లు నెట్ ఫ్లిక్స్ ను వీడుతున్నారు. ఈ ఓటీటీ దిగ్గజం క్రమంగా తన యూజర్లను దూరం చేసుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గుతూనే ఉంది. కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయాల ప్రకటనను (Q2 2022) మంగళవారం విడుదల చేసింది. ఇందులో తమ యూజర్లను కోల్పోయినట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఇలా వరుసగా రెండు త్రైమాసికాల్లో యూజర్లను కోల్పోవడం నెట్ ఫ్లిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఎంతమంది యూజర్లను కోల్పోయింది..
ఇది జూన్ త్రైమాసికంలో దాదాపు 9,70,000 చెల్లింపు సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. ఈ త్రైమాసికంలో దాదాపు 20 లక్షల మంది నెట్ ఫ్లిక్స్ ను వీడతారని ముందు వేసిన అంచనాల కంటే ఇది కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఇలా యూజర్లను కోల్పోవడం మాత్రం నెట్ ఫ్లిక్స్ జీర్ణించుకోలేక పోతోంది. మార్చి త్రైమాసికంలో (Q1 2022), స్ట్రీమింగ్ దిగ్గజం దాదాపు 2,00,000 చెల్లింపు చందాదారులను కోల్పోయింది.
నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్ల సంఖ్య ఎంత
ప్రస్తుతం, కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 22.06 కోట్ల మంది చెల్లింపు సభ్యులను కలిగి ఉందని తన నివేదికలో వెల్లడించింది. ఇది వచ్చే త్రైమాసికంలో 10 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకట్టుకోవాలని నెట్ ఫ్లిక్స్ ప్రణాళిక వేస్తోంది. ఇంగ్లీష్ భాషలో స్ట్రీమ్ అవుతున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 వాల్యూమ్ 1, 2.. అలాగే బెటర్ కాల్ సాల్, పీకీ బ్లైండర్స్ వంటి ఇతర షోలు మంచి ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. ఈ షోలు యూజర్లను ఆకట్టుకుంటాయని నెట్ ఫ్లిక్స్ నమ్ముతోంది. ఇది సెప్టెంబర్ తో ముగిసే ఈ త్రైమాసికంలో చందాదారుల సంఖ్యను పెంచుతుందని నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం గట్టిగా విశ్వసిస్తోంది.
ఆదాయం సంగతేంటి...
కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఈ త్రైమాసికం (Q3 2022) గురించి ఆశాజనకంగా ఉన్నారు. ఆసక్తికరంగా సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గినప్పటికీ కంపెనీ ఇప్పటికీ క్యూ2 2022లో ఆదాయంలో 9 శాతం వృద్ధిని సాధించింది. వచ్చే త్రైమాసికంలో ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తోంది నెట్ ఫ్లిక్స్. ఇది ఇలాగే కొనసాగితే నెట్ ఫ్లిక్స్ భారీ నష్టాలను చవి చూస్తుంది. అయితే తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరి ఈ దిగ్గజ సంస్థ ఏ చేయనుందో చూడాలి.
నెట్ ఫ్లిక్స్ ఏం చేయనుంది...
తిరిగి యూజర్లను పొందేందుకు నెట్ ఫ్లిక్స్ షోలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే తక్కువ ధరకే సబ్ స్క్రిప్షన్ ఇచ్చే యోచనలో ఈ దిగ్గజ సంస్థ అధికారులు ఆలోచిస్తున్నారు. తక్కువ ధరకే సబ్ స్క్రిప్షన్ ఇచ్చి యాడ్స్ ప్లే చేయాలన్న ప్రతిపాదన తీసుకురానున్నారు. ఇలా యాడ్స్ వస్తుంటే అటు ఆదాయం రావడంతో పాటు ఇటు తక్కువ ధరకే సబ్ స్క్రిప్షన్ ఇవ్వవచ్చని నెట్ ఫ్లిక్స్ సహ సీఈవో టెడ్ సరండోస్ తెలిపారు.
యాడ్ సపోర్టెడ్ సబ్ స్క్రిప్షన్ ను తీసుకురావడానికి నెట్ ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, సోనీ పిక్చర్స్ టెలివిజన్‌తో చర్చలు జరుపుతోంది. యాడ్ సపోర్టెడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్ ను మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి అభివృద్ధి చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి యాడ్ సపోర్టెడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్ ను తీసుకురావాలని నెట్ ఫ్లిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కానీ వర్కౌట్ అయితే మళ్లీ నెట్ ఫ్లిక్స్ దూసుకుపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్లు!
Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!
Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!