Nestle India: మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన నెస్లే, ఈ నెల 21 రికార్డ్ తేదీ
2023 సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను పొందే వాటాదార్ల అర్హతను నిర్ణయించడానికి, ఏప్రిల్ 21, 2023ని రికార్డ్ తేదీగా FMCG మేజర్ నిర్ణయించింది.
Nestle India Dividend: 2023 సంవత్సరానికి, రూ. 10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను నెస్లే ఇండియా ప్రకటించింది. కంపెనీ జారీ చేసిన, సబ్‌స్క్రైబ్ చేసుకున్న, పెయిడప్ షేర్లు మొత్తం 9,64,15,716 ఈక్విటీ షేర్లకు ఈ డివిడెండ్ వర్తిస్తుంది.
" 2023 ఏప్రిల్ 12న జరిగే 64వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులు ఆమోదిస్తే, 2022 సంవత్సరానికి తుది డివిడెండ్‌తో పాటు 2023 సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను 8 మే 2023 నుంచి చెల్లించడం ప్రారంభం అవుతుంది" అని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో నెస్లే ఇండియా తెలిపింది.
ఈ నెల 21 రికార్డ్ తేదీ
2023 సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను పొందే వాటాదార్ల అర్హతను నిర్ణయించడానికి, ఏప్రిల్ 21, 2023ని రికార్డ్ తేదీగా FMCG మేజర్ నిర్ణయించింది.
ట్రెండ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం... 2001 మే 31 నుంచి నెస్లే ఇండియా 66 డివిడెండ్‌లను ప్రకటించింది. గత 12 నెలల్లో, ఈ FMCG మేజర్ ఒక్కో షేరుకు రూ. 210 చొప్పున ఈక్విటీ డివిడెండ్‌లను ప్రకటించింది. ప్రస్తుత షేరు ధర రూ. 19525.55తో గణిస్తే, డివిడెండ్ ఈల్డ్ 1.08 శాతంగా ఉంటుంది.
తాజా డివిడెండ్ ప్రకటన తర్వాత, NSEలో ఉదయం 10 గంటల ప్రాంతంలో నెస్లే ఇండియా షేర్లు 0.89% తగ్గి రూ. 19,500 వద్ద ట్రేడవుతున్నాయి.
గత ఏడాది కాలంలో 5.90% రాబడి
గత ఏడాది కాలంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిప్టీ50లో కనిపించిన 5.4% పెరుగుదలతో పోలిస్తే.. ఈ స్టాక్ 5.90% రాబడిని అందించింది, నిఫ్టీ50కి అనుగుణంగా ట్రేడ్ అయింది. ప్రస్తుతం, నెస్లే షేర్లు తమ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 21,050 దిగువన ట్రేడవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ 22న ఈ కౌంటర్ 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. ట్రెండ్‌లైన్ ప్రకారం, గత 12 నెలల్లో ఈ స్టాక్ తక్కువ అస్థిరతను ప్రదర్శించింది, 0.61 బీటా వద్ద ట్రేడ్ అవుతోంది.
గత ఆరు నెలల కాలంలో 4 శాతం పైగా లాభాపడిన ఈ కంపెనీ, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) చూస్తే 0.29% నష్టంతో దాదాపు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది.
నెస్లే ఇండియా, 2023 జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ఈ నెల 25న ప్రకటించనుంది.
FMCG స్పేస్‌లోని టాప్ పాజిటివ్ స్టాక్స్‌లో నెస్లే ఇండియా ఒకటిగా యాక్సిస్ సెక్యూరిటీస్ పరిగణిస్తోంది. ఈ బ్రోకరేజ్ సంస్థ, నెస్లే ఇండియా ఆదాయ వృద్ధిని YoYలో 13%గా అంచనా వేస్తోంది. ధరల పెంపు, గ్రామీణ ప్రాంత విస్తరణ ఈ వృద్ధికి సహకరిస్తాయని చెబుతోంది. అయితే.. అధిక ప్రకటన ఖర్చుల కారణంగా ఎబిటా మార్జిన్ 36 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని లెక్కగట్టింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.