Bank Strike : బ్యాంకుల్లో పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. లేకపోతే మళ్లీ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లోనే.. !

బ్యాంక్ ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు వెళ్తున్నారు. శని, ఆదివారాలు సెలవులు.

FOLLOW US: 

అసలే ఆర్థిక సంవత్సరం ముగింపు. చివరి రెండు రోజులు బ్యాంకుల్లో ( Banks ) వారి లెక్కలు చూసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కస్టమర్లకు సేవలు అందవు. దీనికి తోడు ఇప్పుడు మరో రెండు రోజులు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె (  Bank Strike ) చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ( Bank Employees ) సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఆ రెండు రోజుల్లోనూ బ్యాంకింగ్ సేవలు ఆగిపోనున్నాయి. ఇక 27వ తేదీ ఆదివారం వస్తుంది. అంటే... ఓ రకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లకు బ్యాంకుల సెలవులు ఈ నెల 25వ తేదీనే ఆగిపోతాయని అనుకోవచ్చు. ఎందుకంటే 26వ తేదీన నాలుగో శనివారం. బ్యాంకులకు సెలవు ఉంటుంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్లుగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 

ఎస్‌బీఐ ఎఫెక్ట్ - ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన ICICI

ఆర్థిక సంవత్సరం ( Financial Year Ending ) ముగింపు సందర్భంగా ప్రజలు అనేక రకాల బిల్లులను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వ్యాపార సంస్థలు కూడా తమ లెక్కలను క్లియర్ చేసుకుంటాయి. చెల్లింపులు.. జమలు వంటివి పెండింగ్‌లో ఉంటే పరిష్కరించుకుంటాయి. వీటన్నిటికీ బ్యాంకులు పని చేస్తూ ఉండటం ముఖ్యం. మామూలుగా ఆర్థిక సంవత్సరం చివరి రోజున బ్యాంకులు అంతర్గత పనుల కోసం కస్టమర్లకు సేవలు అందించవు. అయితే ఈ సారి పరిస్థితి మారిపోయింది. నాలుగో శనివారం... ఆదివారం.. ఆ తర్వాత రెండు రోజులు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కల కోసం బ్యాంకింగ్ ( Banking ) సేవలు ప్రజలకు దాదాపుగా వారం రోజుల పాటు అందుబాటులో లేకుండా పోనున్నాయి. 

రూ. 10 వేలు ఓటీఎస్ కడితే రూ. 3 లక్షల రుణం ! ఆ బ్యాంక్ రెడీ ..

అందుకే బ్యాంకులతో పని ఉన్న వారు వీలైనంత త్వరగా... ఈ రెండు, మూడు రోజుల్లోనే పనులు పూర్తి చేసుకోవాలని సలహాఇస్తున్నారు . లేకపోతే అవి పెండింగ్ పడిపోతాయి. మళ్లీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఖాతాలోకి మారిపోతాయి. దీని వల్ల లెక్కల్లో తేడాలు రావొచ్చు. అందుకే వరుస సెలవులు..బ్యాంకుల సమ్మె తేదీలను గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. 

పేటీఎంకు షాకిచ్చిన ఆర్‌బీఐ! కొత్త కస్టమర్ల ఆన్‌బోర్డింగ్‌ ఆపేయాలని ఆదేశం

Published at : 23 Mar 2022 03:10 PM (IST) Tags: Banks Bank holidays end of financial year bank employees strike

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం

Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం

Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి

Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి

Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్‌ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం

Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్‌ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం

Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్‌బౌండ్‌లో కదలాడిన సూచీలు చివరికి..!

Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్‌బౌండ్‌లో కదలాడిన సూచీలు చివరికి..!

Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్‌ @ రూ.24.20 లక్షలు

Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్‌ @ రూ.24.20 లక్షలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?

Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు

Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు