RBI Update: పేటీఎంకు షాకిచ్చిన ఆర్‌బీఐ! కొత్త కస్టమర్ల ఆన్‌బోర్డింగ్ ఆపేయాలని ఆదేశం
Paytm Payments Bank: కొత్త కస్టమర్లను తీసుకోవడం ఆపేయాలని పేటీఎంను రిజర్వు బ్యాంక్ ఇండియా ఆదేశించింది. ఒకవేళ ఆన్‌బోర్డ్ చేయాలంటే తమ అనుమతి తీసుకోవాలని చెప్పింది.
ఇప్పటికే నష్టాల్లో ఉన్న పేటీఎం (Paytm) రిజర్వు బ్యాంక్ ఇండియా (RBI) మరో షాక్ ఇచ్చింది! వెంటనే కొత్త కస్టమర్లను తీసుకోవడం ఆపేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆదేశించింది. కంపెనీ ఐటీ సిస్టమ్‌ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చేంత వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ ఆన్‌బోర్డ్ చేయాలంటే ఆర్‌బీఐ వద్ద ప్రత్యేక అనుమతి తీసుకోవాలని వెల్లడించింది. బ్యాకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్‌కు ఆదేశించామని స్పష్టం చేసింది.
ఇప్పటికే నష్టాల్లో ఉన్న పేటీఎంకు (Paytm) రిజర్వు బ్యాంక్ ఇండియా (RBI) మరో షాక్ ఇచ్చింది! వెంటనే కొత్త కస్టమర్లను తీసుకోవడం ఆపేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆదేశించింది. కంపెనీ ఐటీ సిస్టమ్‌ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని (IT Auditing) నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చేంత వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ ఆన్‌బోర్డ్ చేయాలంటే ఆర్‌బీఐ వద్ద ప్రత్యేక అనుమతి తీసుకోవాలని వెల్లడించింది. బ్యాకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్‌కు ఆదేశించామని స్పష్టం చేసింది.
పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) రెండు నెలల క్రితమే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 'షెడ్యూలు బ్యాంక్' హోదా అందుకుంది. ఫలితంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు, నగదు బదిలీ, రెపో రేట్, రివర్స్ రెపోరేటు, వడ్డీరేట్ల మార్పులు చేసేందుకు వీలుంటుంది. బహుశా ఒక డిజిటల్ బ్యాంకుకు షెడ్యూలు హోదా రావడం ఇదే మొదటిసారి కావొచ్చు!
వినియోగదారులకు నిక్కచ్చిగా సేవలందిస్తూ, సరిగ్గా నిబంధనలను పాటించే బ్యాంకులకు షెడ్యూలు హోదా ఇచ్చే అధికారం రిజర్వు బ్యాంకుకు ఉంటుంది. ఆర్‌బీఐ చట్టం-1934 ప్రకారం ఆర్‌బీఐ సంతృప్తి చెందితే చట్టంలోని రెండో షెడ్యూలులో చేర్చొచ్చు. ఒక షెడ్యూలు పేమెంట్ బ్యాంక్‌గా ఇప్పుడు పేటీఎం మరిన్ని వ్యాపార అవకాశాలను అన్వేషించొచ్చు. కొత్తగా విస్తరించొచ్చు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో (Paytm Payments Bank) ఆడిటింగ్ చేయించడం ఒక సూపర్‌వైజరీ చర్యగా ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వద్ద 5.8 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. 2021, మార్చి 31 నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో 6.4 మిలియన్ల సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. అందులో రూ.5,200 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.
Reserve Bank of India stops Paytm Payments Bank from onboarding new customers pic.twitter.com/wOemAsw21a
— ANI (@ANI) March 11, 2022