Fixed Deposit Rates: ఎస్బీఐ ఎఫెక్ట్ - ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన ICICI
latest FD rates HDFC Bank vs ICICI Bank vs SBI: రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించారు. అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేటు 4.6 శాతంగా నిర్ణయించారు.
ICICI Bank fixed deposits interest rates: అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది. ICICI బ్యాంక్‌లో రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల మధ్య కాలవ్యవధికిగానూ అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేటు 4.6 శాతంగా నిర్ణయించారు. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై రేట్లు యథాతథంగా ఉన్నాయి.
ఎఫ్‌డీలపై ఐసీఐసీఐ వడ్డీ రేట్లు.. (FD Interest Rates ICICI)
2 సంవత్సరాల నుంచి 3 ఏళ్ల మధ్య కాలవ్యవధికి 4.50 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. 15 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.20 శాతంగా ఉంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య కాల వ్యవధికి చేసే ఎఫ్‌డీలపై 4.30 శాతం వడ్డీని ఐసీఐసీఐ అందిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు మార్చి 10 నుంచి అమలులో ఉంటాయి.
ఒక ఏడాది నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్‌డీలపై 4.15 శాతం వడ్డీ అందుకుంటారు. 1 సంవత్సరం టైమ్‌కు చేసే ఎఫ్‌డీలపై అత్యల్పంగా 2.5 శాతం నుండి 3.7 శాతం వరకు వడ్డీ రేట్లను ఐసీఐసీఐ అందిస్తోంది. ఈ ఎఫ్‌డీ రేట్లు సామాన్య కస్టమర్లు, సీనియర్ సిటిజన్స్ కేటగిరీలలో సమానంగా ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ రూ.5 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను సైతం సవరించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు డొమోస్టిక్ కస్టమర్స్, NRO, NREలకు వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లలో ఏ మార్పులు చేయలేదు. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో చేసే ఎఫ్‌డీలపై భారతీయ స్టేట్ బ్యాంక్ 20-40 బేసిస్ పాయింట్లు పెంచగా.. ఐసీఐసీఐ సైతం ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సవరించింది.
డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేట్లు ఇలా (SBI FD Interest Rate)
179 రోజుల వరకు చేసే రూ.2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీని
భారతీయ స్టేట్ బ్యాంక్ అందిస్తోంది. 180 రోజుల నుంచి 210 రోజులకుగానూ చేసే ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 3.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.60 శాతం వడ్డీ ఆఫర్ చేసింది ఎస్బీఐ. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు వడ్డీ రేట్లను 4.40 శాతం, 4.90 శాతం అందిస్తోంది. 1 ఏడాది నుంచి 2 ఏళ్ల కాలానికిగానూ చేసే ఎఫ్‌డీ లపై సాధారణ కస్టమర్లకు 5 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం వడ్డీ లభిస్తుంది.
2 నుంచి 3 ఏళ్ల కాలానికి సాధారణ కస్టమర్లకు 5.10 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం వడ్డీ
3 నుంచి 5 ఏళ్ల మధ్య టైమ్‌కు చేసే ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 5.3 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం వడ్డీ
5 నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 5.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం వడ్డీని అందిస్తుంది ఎస్బీఐ.