search
×

BAF: డౌన్ మార్కెట్‌లోనూ డబ్బును కాపాడే 'బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్'!

మార్కెట్ పెరిగినా, పతనమైనా, ఇన్వెస్టర్ల డబ్బు జారిపోకుండా ఈ ఫండ్‌ బ్యాలెన్స్‌ చేస్తుంది.

FOLLOW US: 
Share:

Balanced Advantage Fund: స్టాక్‌ మార్కెట్‌లో ఎంత తల పండిన వ్యక్తయినా, ఇన్వెస్ట్‌ చేసే సమయంలో కొద్దిగా బెరుకు ఫీల్‌ అవుతాడు. మార్కెట్ పడిపోతే పెట్టుబడి పరిస్థితేంటన్న భయం వెంటాడుతుంది. అదే విధంగా, మార్కెట్ పీక్‌ స్టేజ్‌లోకి వెళ్లినప్పుడు సెల్లాఫ్‌ రిస్క్‌ ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టే మంత్రం.. బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ (BAF).

బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే ఎంటి?
ఇది మ్యూచువల్ ఫండ్ (Mutual Fund) ప్రొడక్ట్‌. ఈక్విటీ & డెట్ రెండింటి కలయికే  బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్. పేరుకు తగ్గట్లే, ఈక్విటీని, డెట్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, దేశీయ & ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఈక్విటీ & డెట్ మధ్య BAF కేటాయింపులను ఫండ్‌ మేనేజర్‌ మారుస్తుంటాడు. ఫలితంగా మార్కెట్ పరిస్థితుల నుంచి పెట్టుబడిదారులకు రక్షణ లభిస్తుంది. మార్కెట్ పెరిగినా, పతనమైనా, ఇన్వెస్టర్ల డబ్బు జారిపోకుండా ఈ ఫండ్‌ బ్యాలెన్స్‌ చేస్తుంది.

మార్కెట్‌లో మంట పెట్టే పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు, వెంటనే రియాక్ట్‌ కావడం, తన పోర్ట్‌ఫోలియోను తక్షణం సర్దుబాటు చేసుకోవడం ఒక సాధారణ పెట్టుబడిదారుడికి కష్టం అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ఈస్ట్రన్‌ యూరోప్‌లో సంవత్సరానికి పైగా సాగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం తలకిందులైంది. ప్రపంచ ఆర్థిక మాంద్య భూతం భయపెడుతోంది. ద్రవ్యోల్బణం ఒత్తిడి, దాని కారణంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు బీపీ పెంచుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో, ICICI ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ వంటి ఫండ్స్‌ గత పదేళ్లుగా ఈక్విటీ/డెట్‌లో ఎంట్రీ/ఎగ్జిట్‌ను బాగా మానేజ్‌ చేశాయి.

స్టాక్‌ వాల్యుయేషన్స్‌ అధికంగా ఉన్నాయా, లేదా చౌకగా ఉన్నాయా అని నిర్ధరించుకోవడానికి ఈ మ్యూచువల్‌ ఫండ్‌ చాలా కఠినమైన ఇన్-హౌస్ వాల్యుయేషన్ మోడల్‌ను అనుసరిస్తుంది. కొవిడ్‌ మహమ్మారి తర్వాత, 2020 మార్చిలో సెన్సెక్స్ రాక్‌-బాటమ్‌కు పడిపోయింది, 29,000 మార్క్ కంటే దిగువకు చేరింది. అప్పుడు, ఈ ఫండ్ హౌస్‌ ఈక్విటీస్‌ ఎక్స్‌పోజర్‌ను 73.7 శాతానికి పెంచింది. 2021 నవంబర్‌ నాటికి, మార్కెట్ 60,000 పాయింట్ల కంటే పై స్థాయికి చేరుకున్నప్పుడు, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ దాని నెట్‌ ఈక్విటీని 30 శాతం కంటే కిందకు తీసుకెళ్లింది. 2023 మే వరకు చూస్తే, BAF నెట్‌ ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ 39.7 శాతంగా ఉంది.

చిన్న ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకుందాం
బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ వ్యూహాన్ని సింపుల్‌గా అర్ధం చేసుకుందాం. మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు చౌకగా షేర్లలోకి ఎంట్రీ తీసుకోవడం & మార్కెట్ పెరిగినప్పుడు వాటి నుంచి ఎగ్టిట్‌ కావడం వీటి పని. దీనివల్ల, మార్కెట్‌ హై రేంజ్‌కు చేరినప్పుడు పెట్టుబడిదార్లకు లాభాలు తెచ్చిస్తుంది. బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ల నెట్‌ ఈక్విటీ ఎక్స్‌పోజర్ 30 శాతం కంటే తక్కువ కూడా ఉండవచ్చు. సాధారణంగా, ఈ స్కీమ్స్‌లో ఈక్విటీకి ఎక్స్‌పోజర్ 65 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటుంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ గత 10 ఏళ్లలో 13.5 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చిందని డేటా చెబుతోంది. బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే, అది ఇచ్చే రాబడి ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువ ఉండేలా, డెట్‌ రిటర్న్స్‌ కంటే మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలంలో, ఈక్విటీ ఆదాయం కంటే BAF ఆదాయం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఇది ఇది తగ్గే ఛాన్స్‌ కూడా ఉంది.

మరో ఆసక్తికర కథనం: ఈ సెక్షన్లు అప్లై చేయండి, ₹4 లక్షల వరకు టాక్స్‌ బెనిఫిట్‌! 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 29 Jun 2023 12:53 PM (IST) Tags: mutual fund MF Scheme balanced advantage fund BAF

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?

Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం

Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం

Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు

Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు

HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన