By: ABP Desam | Updated at : 29 Jun 2023 12:10 PM (IST)
ఈ సెక్షన్లు అప్లై చేయండి, ₹4 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్!
Income Tax Saving Sections: 2023-24 బడ్జెట్‌లో, కొత్త పన్ను విధానంలో (new tax regime) పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. ఇది, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. అయితే, న్యూ టాక్స్ రెజిమ్‌లో శ్లాబ్స్ తప్ప సెక్షన్లు ఉండవు. డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్ పొందలేము. మీ ఆదాయం రూ. 7.5 లక్షలు (రూ. 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి) దాటితే, వర్తించే స్లాబ్ ప్రకారం టాక్స్ చెల్లించాలి.
మీరు పాత ఆదాయ పన్ను పద్ధతిని (old tax regime) ఫాలో అయితే చాలా సెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఆ సెక్షన్ల కింద డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్ లభిస్తాయి. పాత పన్ను పద్ధతిలో, ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద (Tax Saving under Section 80C) రూ. 1.5 లక్షల వరకు మినహాయింపును కేంద్రం ఇస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఇన్‌కమ్ టాక్స్ సెక్షన్ 80C కాకుండా, ఆదాయ పన్ను ఆదా కోసం మరికొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా మీరు లక్షల రూపాయల వరకు పన్ను సేవ్ చేయవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System - NPS)
గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) మీరు NPS పథకం కింద పెట్టుబడి పెడితే, సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అంటే మీ యాన్యువల్ ఇన్‌కమ్ టాక్స్ రూ. 50,000 దాటితే, మీరు ఈ సెక్షన్ కింద రూ. 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం
ఆదాయ పన్ను సెక్షన్ 80D కింద, ఆరోగ్య బీమా కోసం గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన ప్రీమియంపై రూ. 25 వేల నుంచి రూ. 1 లక్ష వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న టాక్స్ పేయర్లకు రూ. 25,000 ప్రీమియం మీద రాయితీ దక్కుతుంది. ఇది కాకుండా, తల్లిదండ్రుల పేరు మీద మీరు కట్టే ప్రీమియంపైనా రూ. 25 వేల పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
హౌస్ లోన్‌పై పన్ను మినహాయింపు
ఇల్లు కొనడానికి లేదా కట్టడానికి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 2 లక్షల వరకు టాక్స్ ఎగ్జమ్షన్ పొందవచ్చు.
పొదుపు ఖాతాల వడ్డీపై ఎగ్జమ్షన్
సేవింగ్స్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసే వాళ్లు, ఆదాయ పన్ను సెక్షన్ 80TTA ప్రకారం, రూ. 10,000 వరకు వార్షిక వడ్డీపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాలకు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎక్కువ పొదుపు ఖాతాలున్న సీనియర్ సిటిజన్లకు, 80TTB కింద రూ. 50,000 వార్షిక వడ్డీ ఆదాయం వరకు పన్ను ఉండదు.
స్వచ్ఛంద సేవ సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను రాయితీ
ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూట్స్ లేదా స్వచ్ఛంద సేవ సంస్థలకు మీరు ఇచ్చే విరాళాల మీద కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయ పన్ను సెక్షన్ 80CCC కింద, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన మొత్తాన్ని మినహాయింపుగా మీరు క్లెయిమ్ చేయవచ్చు. రూ. 200 కంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన విరాళాలే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: టీసీఎస్ బాదుడికి 3 నెలల విరామం, అక్టోబర్ 1 నుంచి వర్తింపు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Husband Seek Divorce : LB నగర్లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!