By: ABP Desam | Updated at : 29 Jun 2023 11:37 AM (IST)
టీసీఎస్ బాదుడికి 3 నెలల విరామం, అక్టోబర్ 1 నుంచి వర్తింపు
RBI Liberalised Remittance Scheme: అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి విదేశాల్లో చేసే ఖర్చులకు సంబంధించిన TCS రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వర్తిస్తాయి. వాస్తవానికి, జులై 1 నుంచి దీనిని వర్తింపజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించినా, తాజాగా ఆ తేదీని మరో మూడు నెలలు ఎక్స్‌టెండ్ చేసింది. ఒక వ్యక్తి, ఒక సంవత్సరంలో చేసే విదేశీ చెల్లింపుల్లో (foreign remittances) రూ. 7 లక్షల వరకు TCS (tax collected at source) వర్తించదు. ఈ సీలింగ్ దాటితే TCS పడుతుంది.
ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, ఆబీఐ LRS (Liberalized Remittance Scheme) కింద, విదేశీ రెమిటెన్స్‌లపై 5% బదులు 20% టీసీఎస్ వసూలు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనిలోనూ రూ. 7 లక్షల మొత్తం వరకు ఊరట ఇచ్చారు.
విదేశాల్లో చేసే ఖర్చు/చెల్లింపులకు కొంతమేర మినహాయింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, దానిపై విధించే టీసీఎస్ రేటును తగ్గించాలన్న డిమాండ్‌కు మాత్రం ఒప్పుకోలేదు. క్రెడిట్ కార్డుల ద్వారా విదేశాల్లో ఎంత ఖర్చు చేసినా టీసీఎస్ రేటులో ఎలాంటి తగ్గింపు ఉండదని. 20% వర్తిస్తుందని ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. టూర్ ప్యాకేజీలు, విదేశాలకు డబ్బు పంపడం సహా అన్ని రకాల విదేశీ చెల్లింపులపై 20 శాతం TCS వసూలు చేస్తుంది. కాకపోతే, దీని అమలును మాత్రం మూడు నెలల పాటు వాయిదా వేసింది.
విద్య & వైద్య సంబంధిత చెల్లింపులకు మినహాయింపు
LRS కింద విదేశీ చెల్లింపులపై (foreign remittances) TCSని 5% నుంచి 20%కు పెంచినా, విద్య & వైద్య పరమైన చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాటికి 20% TCS కాకుండా, గతంలో ఉన్న 5% మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా విదేశాల్లో చేసే వ్యయాన్ని ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి తీసుకువస్తూ, మే 16న, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 'ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్' (ఫెమా/FEMA) కింద నిబంధనలు సవరించింది. ఒక వ్యక్తి భారతదేశం వెలుపల ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే అన్ని అంతర్జాతీయ లావాదేవీలను RBI LRS కిందకు తీసుకువచ్చారు.
LRS కిందకు ఎందుకు తీసుకువచ్చారు?
క్రెడిట్ కార్డ్ లావాదేవీలను RBI LRS కిందకు ఎందుకు తీసుకురావలసి వచ్చింది అన్న విషయంపైనా కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. గతంలో, రూల్ 7 ప్రకారం ఉన్న మినహాయింపు కారణంగా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే ఖర్చులు LRS పరిమితిలోకి రాలేదని, దీనివల్ల కొంతమంది వ్యక్తులు LRS పరిమితులను దాటారని చెప్పింది. ప్రస్తుత LRS పరిమితి 2,50,000 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాలను అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లిస్తున్నారని తేలిందని వెల్లడించింది. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించి ఏకరూపత తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఎల్‌ఆర్‌ఎస్ పరిమితులను దాటకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
మైనర్ సహా ఇండియన్ సిటిజన్స్ అందరూ, RBI అనుమతించిన కరెంట్ అకౌంట్ లేదా క్యాపిటల్ అకౌంట్ (capital account) ద్వారా చేసే విదేశీ చెల్లింపులన్నీ LRS కిందకు వస్తాయి. ఈ పథకం కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు ఆర్‌బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయవచ్చు. ఈ సీలింగ్ దాటి చేసే చెల్లింపులకు ఆర్‌బీఐ పర్మిషన్ తీసుకోవాలి.
మరో ఆసక్తికర కథనం: 4 నెలల కనిష్టంలో పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్‌పై ఉండే చిప్‌లో కీలక సమాచారం, అందుకే అది చాలా ముఖ్యం
Small Saving Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్ న్యూస్ వింటామా?
Property Management: మీ వీలునామాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల డేటా కూడా ఉండాలి - చిన్న నిర్లక్ష్యం ఖరీదు భారీ మూల్యం కావచ్చు!
Gold-Silver Prices Today 29 Dec: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Year Ender 2024: ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ రూల్స్‌లో వచ్చిన 10 ప్రధాన మార్పులు
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!