By: Arun Kumar Veera | Updated at : 06 Jan 2025 10:57 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 06 జనవరి 2025 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: యూఎస్ ఎకనమిక్ డేటా మీద ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,647 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్వచ్ఛమైన బంగారం (24K) 10 గ్రాములకు దాదాపు రూ.80 వేల రేటు నడుస్తోంది. వెండి ధరలోనూ నేడు ఎలాంటి మార్పు లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,030 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,030 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 78,710 | ₹ 72,150 | ₹ 59,030 | ₹ 99,000 |
విజయవాడ | ₹ 78,710 | ₹ 72,150 | ₹ 59,030 | ₹ 99,000 |
విశాఖపట్నం | ₹ 78,710 | ₹ 72,150 | ₹ 59,030 | ₹ 99,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,215 | ₹ 7,871 |
ముంబయి | ₹ 7,215 | ₹ 7,871 |
పుణె | ₹ 7,215 | ₹ 7,871 |
దిల్లీ | ₹ 7,230 | ₹ 7,886 |
జైపుర్ | ₹ 7,230 | ₹ 7,886 |
లఖ్‌నవూ | ₹ 7,230 | ₹ 7,886 |
కోల్‌కతా | ₹ 7,215 | ₹ 7,871 |
నాగ్‌పుర్ | ₹ 7,215 | ₹ 7,871 |
బెంగళూరు | ₹ 7,215 | ₹ 7,871 |
మైసూరు | ₹ 7,215 | ₹ 7,871 |
కేరళ | ₹ 7,215 | ₹ 7,871 |
భువనేశ్వర్ | ₹ 7,215 | ₹ 7,871 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,926 | ₹ 7,475 |
షార్జా (UAE) | ₹ 6,926 | ₹ 7,475 |
అబు ధాబి (UAE) | ₹ 6,926 | ₹ 7,475 |
మస్కట్ (ఒమన్) | ₹ 7,020 | ₹ 7,466 |
కువైట్ | ₹ 6,737 | ₹ 7,348 |
మలేసియా | ₹ 6,901 | ₹ 7,186 |
సింగపూర్ | ₹ 6,804 | ₹ 7,549 |
అమెరికా | ₹ 6,692 | ₹ 7,121 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 110 తగ్గి రూ. 25,670 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: పెట్టుబడి ప్రభుత్వానిది, లాభాలు మీవి - బిజినెస్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Unified Pension Scheme: మరో 10 రోజుల్లో 'ఏకీకృత పింఛను పథకం' - ఇలా దరఖాస్తు చేసుకోండి
Toll Deducted Twice: టోల్ గేట్ దగ్గర రెండుసార్లు డబ్బు కట్ అయ్యిందా? - ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది
Gold-Silver Prices Today 22 Mar: రూ.90,000కు దిగొచ్చిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి