News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Life Insurance Survey : కరోనా తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ పై మారుతున్న అభిప్రాయాలు - ఓ సర్వేలో 86 శాతం మంది జీవిత బీమాకు ఓకే

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో జీవిత బీమాపై చాలా మంది తమ అభిప్రాయాలు మార్చుకున్నారు. ఓ సర్వేలో 86 శాతం మంది తమ కుటుంబాలను రక్షించుకోవడానికి జీవిత బీమా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

FOLLOW US: 
Share:

Life Insurance Survey : మారుతున్న లైఫ్ స్టైల్ కు అనుగుణంగా మన అలవాట్లు మారుతున్నాయి. ఇప్పటి వరకూ లైఫ్ ఇన్సూరెన్స్ ను అంతగా పట్టించుకోని వారంతా ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా భావిస్తున్నారు. ముంబయి నగరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముంబయి నగరంలోని 40 ప్రాంతాల్లో 12 వేల మందిని లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సర్వే చేసింది. "సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్" అనే నినాదంతో లైఫ్ కౌన్సిల్ క్యాంపాయిన్ నిర్వహించింది. ఈ సర్వేలో లైఫ్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతను తెలియజేసింది. దేశంలోని 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉమ్మడిగా లైఫ్ ఇన్సూరెన్స్ అవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు పెద్ద ఎత్తున క్యాంపాయిన్లు నిర్వహిస్తున్నారు. 

71 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి

తాజా సర్వేలో అన్ని వయసుల వారికి ఇన్సూరెన్స్ ఆర్థిక సాధనంగా ఉందని తేలింది. ఈ సర్వేలో లైఫ్ ఇన్సూరెన్స్ ను  ఫైనాన్సియల్ సెక్యూరిటీ, అనుకోని ఘటనల నుంచి రక్షణలా, ఆర్థిక లక్ష్యాలు చేరుకునేందుకు ఒక అవకాశంగా చాలా మంది భావిస్తున్నారు. 71 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. కొందరు ఇప్పటికే ఇన్సూరెన్స్ తీసుకున్నామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన భయాందోళన తర్వాత చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ సర్వేలో 9 శాతం మంది లైఫ్ ఇన్సురెన్స్ తప్పనిసరిగా భావిస్తే, 91 శాతం మంది ముఖ్యమైనదిగా భావించారు.   

మిలీనియల్స్ కూడా ఆసక్తి 

వెస్ట్ మార్కెట్ గణాంకాల ప్రకారం యువత, మిలీనియల్స్ జీవిత బీమా గురించి తెలుసుకోవడమే కాకుండా దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 45 శాతం మందిలో ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన బలంగా ఉంది. పాశ్చాత్య మార్కెట్‌లో జీవిత బీమా చాలా ఎక్కువ. అహ్మదాబాద్, ముంబ, పూణే వంటి ప్రదేశాలలో 92 శాతం మంది జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని భావిస్తున్నారు. జాతీయ సగటు 76 శాతంతో పోలిస్తే, స్నేహితులు, కుటుంబ సభ్యులకు జీవిత బీమాను సూచిస్తున్నట్లు 80 శాతం మంది ఈ సర్వేలో చెప్పారు.

“భారతీయుల్లో జీవిత బీమా గురించి అవగాహనపై మేం ఈ సర్వేను నిర్వహించాం. కుటుంబంలో సంపాదించే ప్రతి సభ్యుడు కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తును అందించడానికి జీవిత బీమా అత్యంత ప్రాధాన్యతగా ఉండేలా చూడాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. జీవిత బీమాపై భారతీయులకు మరింత అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం, తద్వారా ఉత్తమ జీవిత బీమా పరిష్కారాలను అందించగలం” అని లైఫ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ SN భట్టాచార్య అన్నారు. 

జీవిత బీమాపై అవగాహన 

జీవిత బీమా ప్రాముఖ్యత గురించి ప్రజలకు చాలా ఎక్కువ అవగాహన ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. 

- మ్యూచువల్ ఫండ్స్ (63%) లేదా ఈక్విటీ షేర్లు (39%)తో పోలిస్తే జీవిత బీమా దాదాపు 96% మందికి అవగాహన ఉంది
- ఆర్థిక సాధనంగా జీవిత బీమా ప్రాముఖ్యతను అన్ని వయసుల వారు గుర్తిస్తున్నారు. 
- 36 ఏళ్లలోపు వారితో పోలిస్తే 36 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ మంది జీవిత బీమా పాలసీని కలిగి ఉన్నారు.
- ఈ సర్వేలో సగం మంది బీమా ఏజెంట్ నుంచి జీవిత బీమాను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు, అయితే 10 మందిలో ముగ్గురు బ్యాంకుల ద్వార జీవిత బీమా తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. 
- యువకులు ఆన్‌లైన్ మార్గాల ద్వారా జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు
- ఈ సర్వేలో దాదాపు సగం మంది (47%) వారి కుటుంబంలో ఒకరికి జీవిత బీమా పాలసీని కలిగి ఉన్నారని పేర్కొన్నారు 

చాలా మంది జీవిత బీమాను దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారని, అది కూడా ఖర్చుతో కూడుకున్నదని సర్వేలో తేలింది. లైఫ్ కౌన్సిల్ తన "సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్" ప్రచారం ద్వారా జీవిత బీమా విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ఉత్పత్తుల గురించి ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు వాదనలను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. 

ఈ సర్వే గురించి

• ఈ నివేదిక హన్సా రీసెర్చ్ భాగస్వామ్యంతో రూపొందించబడింది
• ఈ నమూనా పరిమాణంలో 25-55 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు పాల్గొన్నారు 
• కవర్ చేయబడిన నగరాల్లో 8 మెట్రో నగరాలు, 9 టైర్ వన్ సిటీలు 23 టైర్ టూ సిటీలు ఉన్నాయి
• అధ్యయనంలో 12000 మందిని సర్వే చేశారు

Published at : 26 Mar 2022 10:06 PM (IST) Tags: Mumbai life insurance Mumbaikars Life Council finance news

ఇవి కూడా చూడండి

Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్‌ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే

Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్‌ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే

Share Market Opening Today 04 December 2023: మార్కెట్‌లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Share Market Opening Today 04 December 2023: మార్కెట్‌లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Stocks To Watch Today 04 December 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' LIC, Granules, CAMS, Hero

Stocks To Watch Today 04 December 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' LIC, Granules, CAMS, Hero

Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
×