By: ABP Desam | Updated at : 28 Jun 2022 05:07 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఆకాశ్ అంబానీ ( Image Source : Getty )
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ ఎంపికయ్యారు. బోర్డు మంగళవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. అదే సమయంలో జియో డైరెక్టర్ పదవి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తప్పుకున్నారు. జూన్ 27 నుంచి ఇది కొనసాగుతుంది.
రమీందర్ సింగ్ గుజరాత్, కేవీ చౌదరీ ఐదేళ్ల కాలానికి జియో డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. 2022, జూన్ 27 నుంచి వారి పదవీకాలం మొదలవుతుంది. కాగా పంకజ్ మోహన్ పవార్‌ను ఐదేళ్ల కాలానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. 2022, జూన్ 27 నుంచి ఆయన పదవీకాలం మొదలవుతుంది.
Also Read: ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని వాడుతున్నారా? జులై 1 నుంచి కేంద్రం నిషేధం.. వాడితే పనిష్మెంట్!!
Also Read: గ్యాప్‌డౌన్ నుంచి 600 పాయింట్ల ర్యాలీ! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
జియో ఆరంభం నుంచి ఆకాశ్ అంబానీ కీలకంగా ఉన్నారు. దగ్గరుండి ప్రణాళికలను అమలు చేశారు. జియో వాటాల అమ్మకం, ఇతర కంపెనీల విలీనాలను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం దేశంలో 5జీ శకం ఆరంభం కాబోతోంది. స్పెక్ట్రమ్ వేలం పనులు మొదలవుతున్నాయి. కాగా ఒక యూజర్‌పై సగటు ఆదాయం (ARP) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఇండస్ట్రీలో రాణించాలని ఇది తప్పదు. ఇలాంటి సమయంలో ఆకాశ్ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం.
Akash Ambani appointed as chairman of Reliance Jio, Mukesh Ambani resigns as director. pic.twitter.com/xDvtl8WKVh
— ANI (@ANI) June 28, 2022
Mukesh Ambani resigns as director of Reliance Jio, Akash Ambani named chairman. Interesting phase ahead. Next generation will have to prove a lot now.
— Parimal Ade (@AdeParimal) June 28, 2022
Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు! స్వల్పంగా తగ్గిన బిట్‌కాయిన్
Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి
Apple Lays off: యాపిల్ నువ్వేనా ఇలా చేసింది! ఉద్యోగుల్ని తొలగించిన టెక్ దిగ్గజం
Stock Market Closing: ఆగని పరుగు! సెన్సెక్స్ 59,842, నిఫ్టీ 17,825! ఇక రూపాయి మాత్రం
టాప్ గెయినర్స్ August 16, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?