Muhurat Trading 2023 Time: నేడు ముహూరత్ ట్రేడింగ్ టైం ఇదే, గంటపాటు స్టాక్ మార్కెట్స్ ఓపెన్
BSE NSE News: వెల్లడించిన వివరాల ప్రకారం, స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లు ఈరోజు (నవంబరు 12) సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు.
![Muhurat Trading 2023 Time: నేడు ముహూరత్ ట్రేడింగ్ టైం ఇదే, గంటపాటు స్టాక్ మార్కెట్స్ ఓపెన్ Muhurat trading 2023: Diwali Muhurat Trading today Timings details here Muhurat Trading 2023 Time: నేడు ముహూరత్ ట్రేడింగ్ టైం ఇదే, గంటపాటు స్టాక్ మార్కెట్స్ ఓపెన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/fed7be54920c08856687d686e51918401699763543163234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Muhurat Trading Today: ఏటా దీపావళి రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉండే సంగతి తెలిసిందే. కానీ, ఇదే రోజున వ్యాపార రంగంలో ఓ శుభ దినంగా పరిగణించి, స్టాక్ మార్కెట్ ను ఒక గంట పాటు తెరుస్తారు. ఈ సమయంలో లావాదేవీలు జరపడం శుభప్రదంగా పెట్టుబడిదారులు భావిస్తుంటారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఈరోజు (నవంబర్ 11) గంటపాటు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. అయితే, ఈ స్పెషల్ సెషన్ ప్రతిరోజూ లాగా సాధారణ ట్రేడింగ్ సమయం ప్రారంభం అయ్యే సమయంలో నిర్వహించరు. సాయంత్రం వేళ ఈ రోజు మొత్తంలో స్టాక్ మార్కెట్ కేవలం ఒక గంట మాత్రమే తెరిచి ఉంటుంది.
ఇవాళ మార్కెట్ ఏ టైంకి తెరుస్తారు?
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెల్లడించిన వివరాల ప్రకారం, స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లు ఈరోజు (నవంబరు 12) సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 6:08 వరకు ప్రీ-మార్కెట్ సెషన్ ఉండనుంది.
ముహూరత్ ట్రేడింగ్ ప్రాధాన్యం ఏంటి?
హిందూ ఆచారాల ప్రకారం.. ఏదైనా మంచి పని లేదా కొత్త పనిని శుభ సమయంలో చేసే సంప్రదాయం ఉంది. దాన్ని అనుసరించి నేడు దీపావళి పర్వదినాన సంపదకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని దేశవ్యాప్తంగా పూజిస్తారు. అందువల్ల, ఈ శుభ సమయంలో మార్కెట్ ఈ రోజు తెరుస్తారు. పెట్టుబడిదారులు, వ్యాపారులకు సంపద వృద్ధి చెందడం ఉద్దేశంతో ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ రోజు షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక గంట పాటు స్టాక్ మార్కెట్ తెరుస్తారు.
ఈ సంప్రదాయం భారతదేశంలో చాలా కాలంగా కొనసాగుతోంది. బీఎస్ఈ 1957లో మొదటిసారిగా ముహూరత్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. దీని తర్వాత, 1992లో, ఎన్ఎస్ఈ ప్రతి ముహూరత్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)