అన్వేషించండి

Mahindra: ఐదు ఎలక్ట్రిక్ కార్లు తీసుకురానున్న మహీంద్రా - ఎప్పటికి రానున్నాయంటే?

మహీంద్రా త్వరలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు లాంచ్ చేయనుంది.

Mahindra Upcoming Cars: ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా 2026 అక్టోబర్ నాటికి ఐదు బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ కాన్సెప్ట్ కార్లను యునైటెడ్ కింగ్‌డమ్‌లో గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రదర్శించింది. మహీంద్రా త్వరలో తీసుకువచ్చే ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే.

మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ8
ఈ8 ఎలక్ట్రిక్ SUV ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఎలక్ట్రిక్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. దీని ఇంటీరియర్ ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ700లానే ఉంటుంది. దీని పొడవు 45 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 10 మిల్లీమీటర్లుగా ఉంది. వీల్‌బేస్ 7 మిల్లీమీటర్ల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. 80 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఇందులో చూడవచ్చు. దీనిని 2024 డిసెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9
2021 మే నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700కు సంబంధించిన కూపే వెర్షన్‌ను తీసుకురావాలని భావించింది. దీని పేరు ఎక్స్‌యూవీ 900 కావచ్చు. ఇది వెనుక భాగంలో వాలుగా ఉండే పైకప్పును పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోడల్ ఎక్స్‌యూవీ.ఈ9 పేరుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని పవర్‌ట్రెయిన్ ఎక్స్‌యూవీ.ఈ8 మాదిరిగానే ఉండవచ్చు. అయితే దీని బాడీ స్టైల్ డిఫరెంట్‌గా ఉండనుంది. ఇది 2025 ఏప్రిల్ నాటికి లాంచ్ కానుందని సమాచారం.

మహీంద్రా బీఈ.05
మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇటీవల భారతదేశంలో టెస్ట్ చేశారు. బీఈ.05 పొడవు 4.3 మీటర్లుగా ఉంది. ఇది టాటా కర్వ్‌తో పోటీపడుతుంది. ఈ కారు 2025 అక్టోబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా బీఈ రోల్-ఈ
మహీంద్రా బీఈ రోల్-ఈ అనేది బీఈ.05 ఎస్‌యూవీకి సంబంధించిన ఆఫ్ రోడ్ సెంట్రిక్ మోడల్. రోల్-ఈ ఎస్‌యూవీ బాడీ క్లాడింగ్, రీప్రొఫైల్డ్ ఫ్రంట్, రియర్ బంపర్‌లు, మందపాటి ఆఫ్ రోడ్ టైర్లు, స్పేర్ టైర్‌తో రూఫ్ మౌంటెడ్ క్యారియర్‌ను ఇది పొందుతుంది. ఇది కూడా 2025 అక్టోబర్లో లాంచ్ కానుందని అంచనా.

మహీంద్రా బీఈ.07
మహీంద్రా బీఈ.07 పొడవు 4.6 మీటర్లు ఉంటుంది. ఇది పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డ్యాష్‌బోర్డ్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లతో పెద్ద టచ్‌స్క్రీన్‌ను పొందుతుంది. బీఈ.07 ఎస్‌యూవీ 2026 అక్టోబర్ నాటికి విడుదల కానుందని భావిస్తున్నారు.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget