అన్వేషించండి

Gas Price: మళ్లీ తగ్గిన గ్యాస్‌ సిలిండర్ ధర - మీ ప్రాంతంలో ఈ రోజు రేటు ఇది

ఈ రోజు (01 మే 2024) నుంచి దేశంలోని వివిధ నగరాల్లో LPG సిలిండర్‌ రేటు 19 రూపాయల వరకు తగ్గింది.

LPG Cylinder Price Reduced From 01 May 2024: లోక్‌సభ ఎన్నికల ‍‌(Lokshabha Elections 2024) నేపథ్యంలో దేశంలోని సామాన్యులకు మళ్లీ ఉపశమనం లభించింది. గ్యాస్‌ సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) వరుసగా రెండో నెలలోనూ తగ్గించాయి. ధరల దెబ్బకు విలవిల్లాడుతున్న ప్రజలకు ఇది కొంతమేర నొప్పి నివారిణి.

ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... ఈ రోజు (01 మే 2024) నుంచి దేశంలోని వివిధ నగరాల్లో LPG సిలిండర్‌ రేటు 19 రూపాయల వరకు తగ్గింది. అయితే, ఈ డిస్కౌంట్‌ కేవలం 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు.

మెట్రో నగరాల్లో కొత్త ధరలు
రూ.19 తగ్గింపు తర్వాత... దిల్లీలో 19 కిలోల గ్యాస్‌ బండ రేటు రూ. 1,745.50కు (Commercial LPG Cylinder Price Today) తగ్గింది. కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ ఈ రోజు నుంచి రూ. 1,859కు అందుబాటులోకి వచ్చింది. ముంబై ప్రజలు ఇప్పుడు బ్లూ సిలిండర్ కోసం రూ. 1,698.50 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో దీని ధర రూ. 1,911గా మారింది.

గత నెలలోనూ కాస్త ఉపశమనం
గత నెల (ఏప్రిల్‌) 01వ తేదీన కూడా కమర్షియల్‌ ఎల్‌పీజీ రేట్లను OMCs తగ్గించాయి, 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ మీద రూ.35 కోతను ప్రకటించాయి. మార్చిలో రూ.25.50 పెంచాయి. ఫిబ్రవరిలోనూ రూ.14 మేర పెంచాయి. జనవరిలో వాణిజ్య సిలిండర్‌ ధరను కేవలం రూపాయిన్నర తగ్గించాయి. 

ప్రజలు ఇళ్లలో వంటకు ఉపయోగించే డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర  ‍‌(Domestic LPG Cylinder Price Today) చివరిసారిగా మార్చి నెలలో తగ్గింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (08 మార్చి 2024) సందర్భంగా, ఆ నెల నుంచి రెడ్‌ సిలిండర్‌ రేటును రూ. 100 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి ఒకరోజు ముందు, మార్చి 07న, పీఎం ఉజ్వల పథకం లబ్ధిదార్లకు సిలిండర్‌ రూ.300 చొప్పున సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. దీంతో, పీఎం ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana -  PMUY) లబ్ధిదార్లకు పీఎంయూవై సబ్సిడీ రూ.300 + రూ.100 డిస్కౌంట్‌ కలిపి, మొత్తం రూ.400 తగ్గింది. దీంతో, ఉజ్వల యోజన లబ్ధిదార్లకు ఒక్కో సిలిండర్ రూ.503 కే అందుబాటులోకి వచ్చింది. ఈ రాయితీ 2025 మార్చి 31 వరకు వర్తిస్తుంది. మార్చి నెల తర్వాత 14 కిలోల సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ ధరలు
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(Domestic LPG Cylinder Price In Hyderabad) రూ. 855కి అందుబాటులో ఉంది. విజయవాడలోనూ దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(Domestic LPG Cylinder Price In Vijayawada) కోసం రూ. 855 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే ధర ఉంది, రవాణా ఛార్జీల వల్ల అతి స్వల్పంగా మారొచ్చు.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కమర్షియల్ సిలిండర్ల ధర తగ్గింది. గత నెలలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఇంకా ఐదు దశల పోలింగ్‌ మిగిలి ఉంది. చివరి దశ ఓటింగ్ జూన్ 01న జరుగుతుంది, ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 04న వెల్లడవుతాయి.

మరో ఆసక్తికర కథనం: ఈ రోజు NSE, BSEలో ట్రేడింగ్‌ జరగదు, కారణమిదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget