News
News
వీడియోలు ఆటలు
X

Liquor Sales: రేట్లు పెరిగినా బాటిళ్లు ఖాళీ, రికార్డులకే కిక్‌ ఎక్కే స్థాయిలో తాగారు

విస్కీ అయినా, రమ్ అయినా, బ్రాందీ అయినా, జిన్ అయినా, ఓడ్కా అయినా... అన్ని రకాల మద్యం విరివిగా అమ్ముడైందని విక్రయాల లెక్కలు చెబుతున్నాయి.

FOLLOW US: 
Share:

Record Liquor Sales in FY23: భారతదేశ ప్రజలు గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తాకిడిని ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల నుంచి నిత్యావసరాల వరకు అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో, ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లను కూడా తగ్గించుకున్నారు. అయితే, మద్యం విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం గురించి అసలు పట్టించుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), అనేక ఆహార పదార్థాల ధరలతో పాటు ఆల్కహాల్‌ రేట్లు కూడా పెరిగినా, మద్యం ప్రియులను అది ప్రభావితం చేయలేదు. మందుబాబులు ఎక్కువ డబ్బు చెల్లించి మరీ బాటిళ్లు కొన్నారు.

రికార్డ్‌ స్థాయిలో అమ్ముడుబోయిన అన్ని రకాల మద్యం
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ప్రజలు దాదాపు 400 మిలియన్ కేసుల మద్యాన్ని కొనుగోలు చేశారని ఎకనమిక్‌ టైమ్స్‌ తన రిపోర్ట్‌లో రాసింది. సగటున తీసుకుంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మద్యం ప్రియులు 4.75 బిలియన్ల 750 ml బాటిళ్లను కొనుగోలు చేశారు. విస్కీ అయినా, రమ్ అయినా, బ్రాందీ అయినా, జిన్ అయినా, ఓడ్కా అయినా... అన్ని రకాల మద్యం విరివిగా అమ్ముడైందని విక్రయాల లెక్కలు చెబుతున్నాయి. వీటితో పాటు ప్రీమియం బ్రాండ్స్‌, అంటే అధిక ధరల మద్యం విక్రయాలు కూడా ఎక్కువగానే జరిగాయి.

గత రికార్డ్‌ కంటే అమ్మకాలు చాలా ఎక్కువ
గణాంకాల ప్రకారం, 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకు, దేశవ్యాప్తంగా 39.5 కోట్ల మద్యం కేసుల విక్రయాలు నమోదయ్యాయి, ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. 2018-19లో దేశవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. ఆ మద్యం అమ్మకాల రికార్డు 4 సంవత్సరాల తర్వాత బద్ధలైంది.

గత ఆర్థిక సంవత్సరంలో, మందు బాబులు 40 మిలియన్ కేసులను అదనంగా కొనుగోలు చేశారు, విక్రయాల రికార్డును 400 మిలియన్ కేసులకు తీసుకెళ్లారు.

గతేడాది బాగా పెరిగిన ధరలు 
గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు అన్ని మద్యం కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయి. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనివిధంగా 2022-23 మధ్యకాలంలో భారతదేశంలో ధరలు పెరిగాయని ప్రముఖ మద్యం కంపెనీ పెర్నోడ్ రికార్డ్ (Pernod Ricard) అధికారి గత నెలలో విశ్లేషకుల కాల్‌లో తెలిపారు. ఇలా, కాలం గాని కాలంలో రేట్లు పెంచినా కస్టమర్ల నమ్మకం మాత్రం చెక్కుచెదరలేదు. రాబోయే కాలానికి సంబంధించి భారతీయ మార్కెట్‌పై చాలా అంచనాలను ఆ అధికారి వ్యక్తం చేశాడు. పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, మన దేశంలో ఎంట్రీ లెవల్‌ రాయల్ స్టాగ్ విస్కీని విక్రయిస్తుంది. ప్రీమియం విభాగంలో బాలంటైన్, చివాస్ రీగల్, ది గ్లెన్‌లివెట్ వంటి బ్రాండ్‌లను అమ్ముతుంది. ఓడ్కా విభాగంలో సంపూర్ణ బ్రాండ్‌ను విక్రయిస్తుంది.

విస్కీ ఎక్కువగా తాగుతున్నారు
ఎకనమిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం, భారతదేశ ప్రజలు విస్కీని ఎక్కువగా తాగుతున్నారు. గత ఏడాది దీని విక్రయాలు 11.4 శాతం వృద్ధి చెందాయి, భారత్‌లోని మొత్తం మద్యం విక్రయాల్లో మూడింట రెండొంతుల అమ్మకాలు దీనివే. అదే సమయంలో, మొత్తం అమ్మకాల్లో 21 శాతం బ్రాందీ, 12 శాతం రమ్ బాటిల్స్‌ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఓడ్కా, జిన్ అమ్మకాలు అత్యంత భారీ వృద్ధిని సాధించాయి. వాటి అమ్మకాలు వరుసగా 29 శాతం, 61 శాతం పెరిగాయి.

Published at : 09 May 2023 05:23 PM (IST) Tags: 2022-23 India FY23 Liquor sales

సంబంధిత కథనాలు

Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ

Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?