News
News
X

LIC Super Saving Scheme: ఎల్‌ఐసీలో రోజుకు ₹74 కడితే చాలు, ₹48 లక్షలు చేతికి వస్తుంది

ప్రతి రోజూ రూ. 74 కంటే తక్కువ ఆదా చేసినా, లేదా పెట్టుబడిగా పెట్టినా నిర్దిష్ట కాల పరిమితి తర్వాత భారీ మొత్తంలో రాబడి పొందే కొత్త పథకాన్ని LIC తీసుకొచ్చింది.

FOLLOW US: 

LIC Super Saving Scheme: మీరు ఒక మంచి సేవింగ్స్‌ ప్లాన్‌ కోసం చూస్తున్నారా..? అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్తగా తీసుకువచ్చిన పథకాన్ని ఒకసారి పరిశీలించండి. దీనిలో ప్రయోజనాలు బోలెడు ఉన్నాయ్.

వివిధ వినియోగదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా పథకాలు అమలు చేస్తోంది. తక్కువలో తక్కువగా నెలకు రూ. 500 తోనూ పెట్టుబడి అవకాశాలను అందిస్తోంది. ఇప్పుడు మేం చెబుతున్న స్కీమ్‌ ఇంకా కొత్తది. మీరు ప్రతి రోజూ రూ. 74 కంటే తక్కువ ఆదా చేసినా, లేదా పెట్టుబడిగా పెట్టినా నిర్దిష్ట కాల పరిమితి తర్వాత భారీ మొత్తంలో రాబడి పొందే కొత్త పథకాన్ని LIC తీసుకొచ్చింది.

ఇదొక ఎండోమెంట్‌ పాలసీ. సాధారణ బీమా పాలసీల కంటే కాస్త భిన్నంగా, బీమా కవరేజీ + సేవింగ్స్ ప్లాన్ రెండింటినీ ఇది మీకు అందిస్తుంది. అన్ని పథకాల్లాగే దీని మీదా ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే... నిర్దిష్ట కాల వ్యవధి వరకు క్రమం తప్పకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ వెళ్లవచ్చు. LIC తీసుకు వచ్చిన ఈ కొత్త ఎండోమెంట్‌ పాలసీ ఒక నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. పాలసీ మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు ఒకేసారి పేద్ద మొత్తాన్ని పొందవచ్చు. ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగి పాలసీదారు మరణిస్తే, ఆ కుటుంబానికి డబ్బు అందుతుంది. తద్వారా, బాధిత కుటుంబానికి ఈ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుంది.

ఎల్‌ఐసీ కొత్త ఎండోమెంట్‌ పాలసీ మీద రుణం కూడా తీసుకోవచ్చు. అనుకోని ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు. 

News Reels

పాలసీ పూర్తి వివరాలు
ఈ పాలసీని తీసుకోవాలంటే కనీస వయస్సు 8 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు. 8 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు - 75 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లు పాలసీలో ప్రవేశించడానికి అనర్హులు.

పాలసీ కోసం కనిష్టంగా 12 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. 

ఒక లక్ష రూపాయల బీమా కవరేజీ కోసం 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ పాలసీ తీసుకుంటే... 15 ఏళ్ల పాలసీ టర్మ్‌ కోసం ఏడాదికి కనీసం రూ. 6,978 ప్రీమియం కట్టాలి. 25 ఏళ్ల పాలసీ టర్మ్‌ కోసం ఏడాదికి కనీసం రూ. 3,930 ప్రీమియం చెల్లించాలి. 35 ఏళ్ల పాలసీ టర్మ్‌ తీసుకుంటే, వార్షిక కనీస ప్రీమియం 2,754 రూపాయలు.

మీ పిల్లల వయస్సు 8 లేదా 9 సంవత్సరాల అయితే వాళ్ల పేరు మీదే బీమా కవరేజీ పొందవచ్చు. మీ చిన్నారికి ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీ పేరు మీద కవరేజీని కొనుగోలు చేయవచ్చు. నెలవారీగా లేదా సంవత్సరానికి ఒకసారి తక్కువ మొత్తాలు కట్టుకుంటూ, ఎక్కువ కాలం పాటు పొదుపు చేయాలని భావిస్తున్న వాళ్లకు ఈ చిన్న మొత్తాల పెట్టుబడి పథకం అనుకూలంగా ఉంటుంది.

Published at : 10 Nov 2022 12:47 PM (IST) Tags: Life Insurance Corporation Lic Saving scheme Endowment Policy

సంబంధిత కథనాలు

SNPL vs BNPL: బయ్‌ నౌ పే లేటర్‌కు పోటీగా మరో ఆఫర్‌! అప్పుతో పన్లేకుండానే ఆన్‌లైన్‌ షాపింగ్‌!

SNPL vs BNPL: బయ్‌ నౌ పే లేటర్‌కు పోటీగా మరో ఆఫర్‌! అప్పుతో పన్లేకుండానే ఆన్‌లైన్‌ షాపింగ్‌!

Gold-Silver Price 27 November 2022: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ.53 వేల దిగువకు - ఊరటనిచ్చిన వెండి

Gold-Silver Price 27 November 2022: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ.53 వేల దిగువకు - ఊరటనిచ్చిన వెండి

Petrol-Diesel Price, 27 November 2022: వాహనదారులకు ఊరట - తెలంగాణలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఏపీలో ఇలా

Petrol-Diesel Price, 27 November 2022: వాహనదారులకు ఊరట - తెలంగాణలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఏపీలో ఇలా

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

New Pension Vs Old Pension: ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్‌! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!

New Pension Vs Old Pension: ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్‌! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!

టాప్ స్టోరీస్

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!