By: ABP Desam | Updated at : 03 Sep 2021 11:08 AM (IST)
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం సబ్‌స్క్రిప్షన్ గడువు నేటితో (సెప్టెంబర్ 3) ముగియనుంది. సావరీన్ గోల్డ్ బాండ్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడిదారులు గ్రాముకు రూ .50 ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. డీ మ్యాట్ అకౌంట్ల ద్వారా గానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ఇతర మార్గాల ద్వారా గానీ సావరీన్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీంలో కనీస పెట్టుబడి ఒక గ్రాముగా ఉంది. ఇందులో చేరాలనుకునే వారు బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి.
ఈ స్కీంకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. తమ బ్యాంకు నుంచే ఆన్‌లైన్ ద్వారా సావరీన్ గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేయవచ్చని తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. తమ ఖాతాదారులు ఈ-సర్వీస్‌లో ఉన్న ఐఎన్‌బీ ఆప్షన్ ద్వారా నేరుగా ఈ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చని ఎస్‌బీఐ తెలిపింది.
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22.. గోల్డ్ బాండ్ ధర, రిటర్న్ వివరాలు..
దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎస్‌బీఐ కస్టమర్లు 1800 11 2211 నంబరును సంప్రదించవచ్చు.
Planning to invest in Gold?
— State Bank of India (@TheOfficialSBI) August 31, 2021
Here are 6 golden reasons to invest in Sovereign Gold Bonds.
SBI customers can invest in these bonds on https://t.co/YMhpMwjHKp under e-services.
Know more: https://t.co/H4BpchASeA#Gold #GoldBond #SGBWithSBI #SovereignGoldBonds pic.twitter.com/RWY8QStBWU
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు 1-800-180-2222 లేదా 1-800-103-2222 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చు.
Don't miss the Sunehra Mauka!
— Punjab National Bank (@pnbindia) August 30, 2021
Subscription for Sovereign Gold Bond Scheme starting from 30th August.#SovereignGoldBond pic.twitter.com/OkE5hmhBjk
Also Read: Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. గ్రాముకు ఎంత తగ్గిదంటే..
Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్!
Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌కు వరుస నష్టాలు - ఇన్వెస్టర్ల ఆందోళన
Stock Market: ఈ వారం టాప్ 10 కంపెనీలకు రూ.2.28 లక్షల కోట్ల నష్టం
సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల
Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>