Buzzing Stocks: ఒడిదొడుకుల మార్కెట్లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్.. Tata Motors, Eicher Motors..
దేశంలోని లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను నేడు ప్రకటించనున్న తరుణంలో ఇన్వెస్టర్లు సదరు కంపెనీల షేర్లపై ఫోకస్ కొనసాగిస్తున్నారు.
Trending Stocks: దేశవ్యాప్తంగా ఈరోజు నాలుగో విడద లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వారంలో గిఫ్ట్ నిఫ్టీ సూచీ మార్కెట్లు నష్టాల్లో ప్రారభమౌతాయని సూచిస్తోంది. అయితే ఈ క్రమంలో నేడు మార్కెట్లలో కొన్ని కంపెనీల షేర్లు మాత్రం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. సోమవారం మార్కెట్లలో ట్రేడర్లు గమనించాల్సిన స్టాక్స్ వివారులు ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ : దేశీయ ఆటో రంగంలో పెద్ద ఆటగాడిగా ఉన్న టాటా మోటార్స్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.3 శాతం పెరిగి రూ.1,19,986 కోట్లకు చేరుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ త్రైమాసికంలో 7,860 మిలియన్ పౌండ్ల ఆదాయంలో 10.7 శాతం వృద్ధికి దోహదపడింది.
ఐషర్ మోటార్స్ : బుల్లెట్ బైక్స్ తయారీతో పాటు హెవీ వెహికల్స్ ఉత్పత్తి చేసే ఆటోమొబైల్ కంపెనీ మార్చి FY24 త్రైమాసికంలో రూ.983.3 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నివేదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసిక కాలంతో పోల్చితే 32 శాతం వృద్ధి చెందింది. బలమైన ఆపరేటింగ్ నంబర్స్ కారణంగా కంపెనీ త్రైమాసిక ఆదాయం రూ.4,192 కోట్లకు చేరుకుంది.
ఐసిఐసిఐ బ్యాంక్ : బ్యాంక్ కార్డ్స్, పేమెంట్ సొల్యూషన్స్, ఇ-కామర్స్ ఎకోసిస్టమ్, మర్చంట్ ఎకోసిస్టమ్, కన్స్యూమర్ ఫైనాన్స్ హెడ్‌గా బిజిత్ భాస్కర్ రాజీనామా చేశారు. ఆయన మే 18 నుంచి బ్యాంకు సీనియర్ మేనేజ్‌మెంట్ సిబ్బందిగా పనిచేయడం మానేస్తారు. దీంతో కంపెనీ షేర్లు నేడు ఫోకస్ లో ఉన్నాయి.
జైడస్ లైఫ్ సైన్సెస్: ఫార్మా కంపెనీ USలో డెక్సామెథాసోన్ టాబ్లెట్‌లను మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి ఆమోదం పొందింది. Dexamethasone ఆర్థరైటిస్, రక్తం/హార్మోన్ రుగ్మతలు, అలెర్జీ రియాక్షన్స్, చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, శ్వాస సమస్యలు, ప్రేగు రుగ్మతలు, క్యాన్సర్, రోగనిరోధక వ్యవస్థ లోపాలు వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
Q4 ఫలితాలు..
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వరుణ్ బెవరేజెస్, జొమాటో, జిందాల్ స్టీల్ & పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, యూపీఎల్, సనోఫీ ఇండియా, చాలెట్ హోటల్స్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఐనాక్స్ ఇండియా, ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ సహా మరిన్ని కంపెనీలు తమ మార్చి ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లపై దృష్టి సారించారు.
ఇదే క్రమంలో సీఈ ఇన్ఫో సిస్టమ్స్, సెరా శానిటరీవేర్, ఎథోస్, ఆర్తి ఫార్మలాబ్స్, అలెంబిక్, యశో ఇండస్ట్రీస్, జాన్ కాకెరిల్ ఇండియా, SMC గ్లోబల్ సెక్యూరిటీస్ , నెల్‌కాస్ట్, సెయింట్-గోబైన్ సెకురిట్, మనాలి పెట్రోకెమికల్స్, జై భారత్ మారుతి, GIC హౌసింగ్ ఫైనాన్స్, ఆల్బర్ట్ డేవిడ్, ఇండ్-స్విఫ్ట్ లాబొరేటరీస్, వా సోలార్, కెప్టెన్ పైప్స్, సంజీవని పేరెంటరల్, ఆర్వీ ఎన్‌కాన్, గిల్లాండర్స్ అర్బుత్‌నాట్ & కో, విశాల్ బేరింగ్స్, TCI ఇండస్ట్రీస్, శాంతి స్పింటెక్స్, ఫీనిక్స్ టౌన్‌షిప్, లుడ్లో జూట్ & స్పెషాలిటీస్, వెల్కాస్ట్ స్టిల్స్, వెల్కాస్ట్ స్టిల్స్, వెల్కాస్ట్ బ్రదర్స్, ఆషికా క్రెడిట్ క్యాపిటల్, బాలకృష్ణ పేపర్ మిల్స్, TCFC ఫైనాన్స్, ఐకో లైఫ్‌సైన్సెస్, QGO ఫైనాన్స్ లిమిటెడ్, పెంటోకీ ఆర్గానీ (ఇండియా), ధనలక్ష్మి కోటెక్స్, KJMC ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండో కాట్స్‌పిన్, IB ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ సైతం తమ క్యూ4 ఫలితాలను నేడు ప్రకటించనున్నాయి.