By: ABP Desam | Updated at : 19 May 2023 10:43 AM (IST)
పాత-కొత్త పన్ను పద్ధతుల్లో దేన్ని ఫాలో అవుతున్నారు?
Income Tax: మీరు జీతం తీసుకునే పన్ను చెల్లింపుదారు (Salaried Taxpayer) అయితే, ఈ వార్త కచ్చితంగా మీ కోసమే. ప్రస్తుతం, మన దేశంలో పాత, కొత్త పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 50 రోజులు అవుతోంది కాబట్టి, మీరు అనుసరించే పన్ను విధానం (పాత/కొత్త) గురించి ఈపాటికే మీ కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చి ఉండాలి. మీరు ఇప్పటికీ దాని గురించి సమాచారం ఇవ్వకపోతే, జీతం నష్టపోవాల్సి వస్తుంది.
పాత పన్ను విధానాన్ని క్రమంగా పక్కకు నెట్టేసి, కొత్త పన్ను విధానాన్ని విస్త్రతంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం, కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) డిఫాల్ట్ విధానంగా తెరపైకి తెచ్చింది. బట్టి, పాత-కొత్త పన్ను పద్ధతుల్లో ఒకదానిని ఎంచుకునే సమయంలో చేసే నిర్లక్ష్యం లేదా జాప్యం లేదా బద్ధకం వల్ల సదరు టాక్స్‌పేయర్ ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
కొత్త పన్ను వ్యవస్థ డిఫాల్ట్‌గా ఉండడం అంటే ఏంటో మొదట తెలుసుకుందాం. పాత లేదా కొత్త పన్ను పద్ధతిలో మీరు దేనిని ఎంచుకుంటారో మీ కంపెనీ యాజమాన్యానికి మీరు చెప్పకపోతే, ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానం రూల్స్ మీ జీతంపై అప్లై అవుతాయి. ఇంకా సరళంగా చెప్పాలంటే, మీరు ఫాలో అయ్యే పన్ను విధానం గురించి మీ యాజమాన్యానికి ముందుగానే చెప్పకపోతే, కొత్త పన్ను విధానాన్ని మీరు ఎంచుకున్నట్లు భావిస్తారు.
TDS ఎక్కువ కట్ కావచ్చు
ఉద్యోగులు కొత్త లేదా పాత పన్ను విధానంలో దేనిలో కొనసాగాలనుకుంటున్నారో సమాచారం తీసుకోవాలని కంపెనీల యజమానులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఇటీవల సూచించింది. మీ జీతంపై విధించాల్సిన పన్నును, మీరు ఎంచుకున్న పన్ను విధానం ప్రకారం లెక్కిస్తారు. దాని ప్రకారమే యజమాని TDS కట్ చేస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరం (2024-25 మదింపు సంవత్సరం) నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్‌గా మార్చారు కాబట్టి, మీ ఎంపిక గురించి ఎలాంటి సమాచారం యాజమాన్యానికి వెళ్లకపోతే, కొత్త పన్ను విధానం ప్రకారం మీ జీతం నుంచి TDS కట్ అవుతుంది.
ITR ఫైల్ చేసే సమయంలో మార్చుకునే అవకాశం
పాత పన్ను విధానంలో HRA, సెక్షన్ 80C, 80D, సెక్షన్ 24 (b) సహా దాదాపు 70 మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మినహాయింపులు పోయాక మీ పన్ను బాధ్యత లెక్క తేలుతుంది. పాత విధానం మీకు లాభదాయకంగా ఉన్నా, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మీరు ఆ పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే, కొత్త విధానం ప్రకారం మీ జీతం నుంచి ఎక్కువ TDS కట్ అవుతుంది. అయితే, ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే సమయంలో మీరు మీ ప్రాధాన్యత ఎంపికను మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే, కొత్త పద్ధతి ప్రకారం జీతంలో కటింగ్స్ పడినా, పాత విధానంలో ITR సమర్పించే ఛాన్స్ ఉంటుంది. మీ పన్ను బాధ్యత కంటే ఎక్కువ TDS కట్ అయితే, దానిని క్లెయిమ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ఒకసారి ITR ఫైల్ చేసిన తర్వాత మీ ఎంపికను మార్చడానికి అవకాశం ఉండదని గుర్తుంచుకోండి.
కొత్త పన్ను విధానం 2020లో ప్రారంభమైంది. కొత్త వ్యవస్థను ఆకర్షణీయంగా మార్చేందుకు, 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అనేక మార్పులు ప్రకటించారు. మొదటిది.. ఈ విధానంలో, రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను విధించరు. శ్లాబుల సంఖ్యను 6 నుంచి 5కి తగ్గించారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో మరో రూ. 50,000 అదనపు ప్రయోజనం ఉంటుంది. వీటి తర్వాత పన్ను బాధ్యత నిర్ణయం అవుతుంది.
ఇది కూడా చదవండి: క్రెడిట్ కార్డ్ తీస్తే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయ్, రూల్స్ మార్చిన ఆర్‌బీఐ
Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
Form 16: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్లైన్లో చూసే ఆప్షన్ కూడా ఉంది
EPFO: 6 కోట్ల మంది సబ్స్క్రైబర్లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?
Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్ బిలియనీర్ సలహా
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!