అన్వేషించండి

Investor Mark Mobius: చైనా పతనం మనకు లాభం..! 50 ఏళ్ల వరకు భారత మార్కెట్లకు తిరుగులేదు!

డ్రాగన్‌ దేశంలో పరిస్థితులు చేయి దాటుతున్నాయి. ఫలితంగా భారత మార్కెట్ల జోరు పెరగనుంది. వెటరన్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ ఇదే అంటున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత స్టాక్‌ మార్కెట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని వెటరన్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అంటున్నారు. తన ఎమర్జింగ్ మార్కెట్‌ ఫండ్స్‌లో దాదాపుగా 50 శాతం భారత్‌, తైవాన్‌కే కేటాయించానని తెలిపారు. ప్రస్తుతం చైనా షేర్లు నష్టాల బాట పట్టాయని మిగతా వాటితో పోలిస్తే లాభాలు రావడం లేదని వెల్లడించారు.

'భారత్‌ 50 ఏళ్ల ర్యాలీలో ఉంది' అని మొబియస్‌ అన్నారు. పదేళ్ల క్రితం చైనా మార్కెట్లు ఉన్నట్టుగా భారత్‌ ఉందని స్పష్టం చేశారు. అప్పుడప్పుడు బేర్‌ పట్టు బిగించినా, షార్ట్ సెల్లింగ్‌ జరుగుతున్నా భారత్‌ మెరుగ్గా ఉందన్నారు. సంస్కరణలు వేగంగా చేపట్టడం, అన్ని రాష్ట్రాల్లోనూ నిబంధనలు ఒకేలా ఉండటం సుదీర్ఘ కాలంలో దేశానికి మేలు చేస్తోందని పేర్కొన్నారు.

2020, మార్చి నుంచి విపరీతంగా ర్యాలీ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలు తగ్గుతాయని మోర్గాన్‌ స్టాన్లీ, నొమురా వంటి అనలిస్టులు అంచనా వేస్తోంటే మొబియస్‌ మాత్రం బుల్లిష్‌గా ఉన్నారు. అతి నియంత్రణ వల్ల చైనా మార్కెట్లు రాణించడం లేదని పేర్కొన్నారు. 'చైనా పరిస్థితి బాగా లేకపోవడంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లూ అలాగే ఉంటాయని అనుకుంటున్నారు. కానీ వారు పైపైకి ఎగిసే ఇండియా మార్కెట్లు చూడాలి' అని ఆయన తెలిపారు.

మొబియస్‌ ఫోర్ట్‌పోలియోలోని ఎమర్జింగ్ మార్కెట్స్‌ ఫండ్‌లో 45 శాతం భారత్‌, తైవాన్‌కే కేటాయించారు. సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. చైనా మార్కెట్ల పతనం ఇతర దేశాల్లో పెట్టుబడులకు మార్గాలు తెరుస్తోందని ఆయన అంటున్నారు. 'ప్రభుత్వాలు మరింత మెరుగ్గా నియంత్రణ చేపట్టాలి. గుత్తాధిపత్యాన్ని నివారించాలి. మేం చిన్న, మధ్య తరహా కంపెనీలపై ఆసక్తితో ఉన్నాం. ప్రభుత్వ సంస్కరణల వల్ల ఇవి ప్రయోజనం పొందుతాయి' అని మొబియస్‌ అన్నారు.

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget