UPI Server Down : యూపీఐ సర్వర్లు డౌన్, గంటకు పైగా పేమెంట్స్ యాప్స్ సేవలకు అంతరాయం
UPI Server Down : దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్లు గంటకు పైగా నిలిచిపోయాయి. దీంతో పేమెంట్స్ యాప్స్ ద్వారా లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. యాప్ ద్వారా పేమెంట్స్ అవ్వడం లేదని యూజర్లు ట్విట్టర్ లో ఫిర్యాదులు చేస్తున్నారు.
UPI Server Down : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వర్ గంటకు పైగా పనిచేయకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. PhonePe, Google Pay, Paytm వంటి ప్రధాన UPI యాప్‌ల ద్వారా లావాదేవీలు ప్రాసెస్ కావడం లేదని వినియోగదారులు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేశారు. పేమెంట్స్ ప్రాసెసింగ్ చాలా సేపు అవుతుందని, తర్వాత చెల్లింపులు ఫేయిల్ అయినట్లు సమాచారం వస్తుందని వినియోగదారులు కంప్లైంట్ చేశారు.
We understand that you are facing issues while initiating the transactions, Anjan! It looks like an issue with the UPI servers of the bank, which could be temporary. Please wait for some time and try again. ∞SD
— @PhonePeSupport (@PhonePeSupport) April 24, 2022
UPI సర్వర్ డౌన్ కావడం ఈ ఏడాది ఇది రెండోసారి. జనవరి 9వ తేదీన యూపీఐ సర్వర్లు డౌన్ అయ్యాయి. సర్వర్ల డౌన్ పై NPCI ఇంకా అధికారిక ప్రకటనను జారీ చేయలేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కు చెందిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ భారతదేశ రిటైల్ లావాదేవీలలో 60 శాతానికి పైగా ఉంది. చెల్లింపుల వ్యవస్థ భారీ మొత్తంలో లావాదేవీలను నిర్వహిస్తుంది. వాటిలో ఎక్కువ భాగం తక్కువ-విలువ లావాదేవీలు ఉన్నాయి. UPI వాల్యూమ్‌లలో రూ.100 కంటే తక్కువ లావాదేవీలు 75 శాతం ఉంటాయి. మార్చి నెలలోనే UPI పేమెంట్స్ ద్వారా 540 కోట్ల లావాదేవీలలో మొత్తం 9.60 లక్షల కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. NPCI బ్యాంక్, అంతర్గత సర్వర్‌లపై భారాన్ని తగ్గించడానికి ఆఫ్‌లైన్ మోడ్‌లో చెల్లింపులను ప్రారంభించే పనిలో ఉంది.
UPI server down, major hit for payment processing and failed transactions piling up.@Google pay my amount got failed, refund
— arun (@warriorprincetn) April 24, 2022
Yesterday night, saw a man in DMart tryin to pay bill through UPI, alas server was down, had no Card🙃. Man left his family at 10 pm to go to his house, to get cash.
— Jai Desai (@jdesai0403) April 24, 2022
🇮🇳 is willing to adapt to new methods like UPI, but network, telecom etc must be strengthened for upliftment of🇮🇳