అన్వేషించండి

T+1 settlement: స్టాక్‌ మార్కెట్‌లో కీలక సంస్కరణ, ప్రతి ఇన్వెస్టర్‌కి మేలు చేసే మార్పు ఇది

ఒక పెట్టుబడిదారు కొనుగోలు చేసిన లేదా విక్రయించిన స్టాక్స్‌ ఒక్క రోజు వ్యవధిలోనే అతని/ఆమె డీమ్యాట్ ఖాతాలో ప్రతిబింబిస్తాయి.

T+1 settlement: భారతీయ స్టాక్ మార్కెట్లలో మరో కీలక మార్పు నేటి (శుక్రవారం, జనవరి 27, 2023) నుంచి ప్రారంభమైంది. ఆఖరి బ్యాచ్‌ స్టాక్స్‌ కూడా నేటి నుంచి షార్టర్‌ సెటిల్‌మెంట్ సైకిల్ లేదా T+1 సెటిల్‌మెంట్‌ విధానంలోకి మారాయి. 

T+1 సెటిల్‌మెంట్‌ అంటే ఏంటి?
ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో, లిస్టెడ్‌ షేర్ల ట్రేడ్ సెటిల్‌మెంట్ 'T+2' (ట్రేడింగ్‌ + 2 డేస్‌) ప్రాతిపదికన జరిగేది. అంటే ఒక పెట్టుబడిదారు కొనుగోలు చేసిన లేదా విక్రయించిన స్టాక్స్‌ 2 రోజుల వ్యవధి తర్వాత అతని/ఆమె డీమ్యాట్ ఖాతాలోకి వచ్చి చేరతాయి లేదా తగ్గుతాయి. ఈ పద్ధతి వల్ల నష్టపోతున్నామంటూ మార్కెట్‌ వర్గాలు చేసిన అభ్యర్థనల మేరకు, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' సెబీ దీనిని ‘T+1’  (ట్రేడింగ్‌ + 1 డే) పద్ధతికి కుదించాలని నిర్ణయించింది. ఫలితంగా.. ఒక పెట్టుబడిదారు కొనుగోలు చేసిన లేదా విక్రయించిన స్టాక్స్‌ ఒక్క రోజు వ్యవధిలోనే అతని/ఆమె డీమ్యాట్ ఖాతాలో ప్రతిబింబిస్తాయి. 

T+1తో ప్రయోజనం ఏంటి ?
సెటిల్‌మెంట్ రోజుల సంఖ్యను తగ్గించడం వల్ల పెట్టుబడిదార్ల లిక్విడిటీ పెరుగుతుంది. షేర్లు వెంటనే డీమ్యాట్‌ ఖాతాల్లో కనిపిస్తాయి. తద్వారా, మరో ట్రేడ్‌ తీసుకోవడానికి, మార్కెట్‌లో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి పెట్టుబడిదార్లకు వీలవుతుంది. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు దీని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

స్టాక్ ఎక్స్ఛేంజీలు NSE & BSE, నవంబర్ 2021లో ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. తాము T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌ను ఫిబ్రవరి 25, 2022 నుంచి దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించాయి. మార్కెట్ విలువ పరంగా చివరన ఉన్న 100 స్టాక్స్‌తో ఈ పనిని మొదలు పెట్టాయి. అక్కడి నుంచి దశల వారీగా T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌కు మార్పు మొదలైంది.

తదుపరి ప్రతి నెల చివరి శుక్రవారం నాడు, దిగువన ఉన్న మరో 500 స్టాక్స్‌ను స్టాక్‌ ఎక్సేంజీలు T+1 సైకిల్‌లోకి తీసుకొచ్చాయి. ఇలా, ప్రతి నెలా చివరి శుక్రవారం నాడు ఇదే తంతు నడిచింది.

సెక్యూరిటీల చివరి బ్యాచ్ -- స్టాక్‌లు, ETFs, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (REITs), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (InvITs) శుక్రవారం నుంచి T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌కి మారాయి. దీంతో, ఈక్విటీ క్యాష్‌ సెగ్మెంట్‌లో (ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌ సహా) అన్ని ట్రేడ్స్‌ T+1 ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. 

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, సెటిల్‌మెంట్ సైకిల్‌ను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2002లో, సెటిల్‌మెంట్ సైకిల్‌లోని రోజుల సంఖ్యను T+5 డేస్‌ నుంచి T+3 డేస్‌కు తగ్గించింది, ఆపై 2003లో T+2 డేస్‌కు తగ్గించింది. 

షార్టర్‌ ట్రేడ్ సెటిల్‌మెంట్ సైకిల్‌కు మారడం దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఒక కీలక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

స్టాక్స్‌లో ‘T+1’ సెటిల్‌మెంట్ సైకిల్‌ను అమలు చేసిన మొదటి అతి పెద్ద మార్కెట్‌ చైనా. అభివృద్ధి చెందిన మార్కెట్లయిన అమెరికా, యూరోప్‌ దేశాలు ఇప్పటికీ ‘T+2’ సెటిల్‌మెంట్ సైకిల్‌లోనే ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
Viral News: చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Viral News: ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
Embed widget