India surpasses Brazil: భారత్ మరో రికార్డు..! 15 ఏళ్ల తర్వాత బ్రెజిల్‌ను దాటేసింది
భారత్ మరో రికార్డు సంపాదించింది. అరబ్ స్టేట్స్ లీగ్‌కు బ్రెజిల్ కన్నా ఎక్కువగా ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 15 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
![India surpasses Brazil: భారత్ మరో రికార్డు..! 15 ఏళ్ల తర్వాత బ్రెజిల్‌ను దాటేసింది India surpasses Brazil as No.1 food supplier to Arab nations after 15 years India surpasses Brazil: భారత్ మరో రికార్డు..! 15 ఏళ్ల తర్వాత బ్రెజిల్‌ను దాటేసింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/eafb907ca88242a671d1d4dc72a88594_0.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాల ఎగుమతుల్లో భారత్ మరో రికార్డు సంపాదించింది. అరబ్ స్టేట్స్ లీగ్‌కు బ్రెజిల్ కన్నా ఎక్కువగా ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 15 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2020లో కరోనా వైరస్ మహమ్మారి వెలుగుచూడటంతో భారత్ తన వాటా పెంచుకుందని అరబ్-బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.
అరబ్ ప్రపంచంతో బ్రెజిల్‌కు వాణిజ్య పరంగా మెరుగైన సత్సంబంధాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి వల్ల బ్రెజిల్ ఎగుమతులపై ప్రభావం పడింది. రవాణా పరంగా దూరం పెరగడమే ఇందుకు కారణం. 22 సభ్యులు గల అరబ్ లీగుకు గతేడాది బ్రెజిట్ 8.15 శాతం వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయగా భారత్ 8.25 శాతం ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచింది. 15 ఏళ్ల తర్వాత బ్రెజిల్ వెనక్కి వెళ్లింది. టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, అర్జెంటీనా ఎగుమతులూ తగ్గాయి.
ఒకప్పుడు బ్రెజిల్ నుంచి ఉత్పత్తులు వచ్చేందుకు 30 రోజులు పట్టేది. మహమ్మారి మూలాన సంప్రదాయ సముద్ర మార్గాల్లో అవాంతరాలు ఏర్పడటంతో ఇప్పుడు 60 రోజులు పడుతోంది. భౌగోళిక పరమైన ప్రయోజనాలతో భారత్ పండ్లు, కూరగాయలు, చక్కెర, తిండి గింజలు, తృణ ధాన్యాలు, మాంసం వంటివి వారం కన్నా తక్కువ సమయంలోనే ఎగుమతి చేయగలుగుతోంది.
కరోనా సమయంలో చైనా సైతం ఆహార ఉత్పత్తులను నిల్వ చేయాలని భావించడంతో బ్రెజిల్ ఎగుమతుల్లో కొంత భాగం అక్కడికీ వెళ్లాయి. సౌదీ అరేబియా వంటి దేశాలు సొంతంగా ఆహార పదార్థాల ఉత్పత్తి చేస్తుండటమూ ఇందుకు దోహదం చేసింది. ఏదేమైనా ఇప్పటికీ సౌదీలే భారీ కొనుగోలు దారులని, అయితే వారు తిరిగి ఎగుమతులూ చేస్తారని ఛాంబర్ తెలిపింది.
Also Read: IPOs This Week: డబ్బుల వర్షమే..! ఈ వారం ఐపీవోకు 4 కంపెనీలు ..! వివరాలు ఇవే
Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్ చేసుకోండి!
Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే!
Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!
Also Read: RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)