అన్వేషించండి

Rice Ban: బియ్యమో రామచంద్రా అంటున్న ప్రపంచ దేశాలు, USలో పరిస్థితి ఎలా ఉంది?

ఐఫోన్ల కోసం క్యూ కట్టినట్లు బియ్యం కోసం డిపార్ట్‌మెంటల్‌ స్టోర్ల ముందు బారులు తీరారు.

India Rice Ban: గత నెలలో, భారత ప్రభుత్వం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధింది. దీంతో, ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఆసియన్ కంట్రీస్‌ ఉలిక్కిపడ్డాయి. చాలా దేశాల్లో రైస్‌ సప్లైలో గందరగోళం ఏర్పడింది. USలో, ఐఫోన్ల కోసం క్యూ కట్టినట్లు బియ్యం కోసం డిపార్ట్‌మెంటల్‌ స్టోర్ల ముందు బారులు తీరారు.

అయితే.. జనం భయపడాల్సిన పని లేదని, యూఎస్‌లో రైస్‌కు కొదవలేదని USA రైస్ ఫెడరేషన్ ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్‌లో వినియోగిస్తున్న బియ్యంలో చాలా భాగం దేశంలోనే పండుతోందని, ఈ సంవత్సరం బ్రహ్మాండమైన దిగుబడి కూడా వచ్చిందని నచ్చజెప్పింది. 

USA రైస్ ఫెడరేషన్ ఎన్ని విధాలా సర్దిచెప్పినా, అగ్రరాజ్యంలో ఆందోళన కనిపిస్తూనే ఉంది. భారత్‌ విధించిన నిషేధంతో యునైటెడ్ స్టేట్స్‌ సహా, భారతీయ బియ్యంపై ఆధారపడే దేశాలపై మీద బాగానే ఎఫెక్ట్‌ పడింది.

తెల్ల బియ్యంపై నిషేధంతో తెల్లబోయిన ప్రపంచ దేశాలు
దేశం నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయకుండా ఈ ఏడాది జులై 20న భారత ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్‌ బ్యాన్‌ ప్రకటించింది. అది తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇండియాలో పెరుగుతున్న రైస్‌ రేట్లకు కళ్లెం వేయడానికి, లోకల్‌గా సప్లై పెంచడానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఈ డెసిషన్‌ తీసుకుంది.

అయితే, బాయిల్డ్‌ రైస్‌, బాస్మతి బియ్యం ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు.

ప్రపంచ మార్కెట్‌లోకి భారత్‌ వివిధ రకాల బియ్యాల్ని ఎగుమతి చేస్తోంది. మొత్తం గ్లోబల్‌ బిజినెస్‌లో 40% వాటా మన దేశానిదే. భారత్‌ బ్యాన్‌ చేసిన బియ్యం రకాల వాటా 15%. ఆగ్నేయాసియాలోని ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా, ఐవరీ కోస్ట్, సెనెగల్‌ భారతదేశ బియ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 

ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవలే ఒక బ్లాగ్ పోస్ట్ చేసింది. "నిషేధంతో ప్రపంచ బియ్యం మార్కెట్‌కు తాజా దెబ్బ" అని దానికి టైటిల్‌ పెట్టింది. గత సంవత్సరం పాకిస్తాన్‌లో భారీ వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి కూడా రైస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తగ్గాయి, గ్లోబల్‌గా రేట్లు పెరిగాయి. ఇప్పుడు, ఇండియా డెసిషన్‌తో పాటు ఎల్ నినో వాతావరణ పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. ఇండియా నుంచి వచ్చే రైస్‌ తగ్గడం వల్ల గ్లోబల్‌గా రేట్లు పెరుగుతాయని, ఆహార అభద్రత పెరుగుతుందని ఆ పోస్ట్‌లో రాసింది.

భారత్‌లో సప్లై పెరిగితే, ఎగుమతులపై నిషేధాన్ని భారత్‌ ఎత్తివేస్తుందని ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భావిస్తోంది. ఇండియా తీసుకున్న నిర్ణయం తాత్కాలికమని, ఎక్కువ కాలం ఉండదని ఆశిస్తోంది.

US మీద ప్రభావం
బియ్యం విషయంలో యునైటెడ్ స్టేట్స్ మంచి పొజిషన్‌లో ఉంది. కాలిఫోర్నియాలో పూర్తి సంవత్సరానికి సరిపడినంత నీరు అందుబాటులో ఉంది. ఇండియా విధించిన నిషేధం వల్ల US బియ్యం దిగుమతుల్లో కేవలం 2.5% ప్రభావితం అవుతుందని అక్కడి ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేశారు. 

యునైటెడ్ స్టేట్స్, ప్రధానంగా స్పెషాలిటీ రైస్‌, అర్బోరియో, జాస్మిన్ రైస్, బాస్మతి వంటి సువాసనలు వెదజల్లే రకాలను దిగుమతి చేసుకుంటోంది. వీటి మీద మాత్రమే ఎఫెక్ట్‌ పడుతోంది. USలో వాడే బియ్యంలో 70-80% సప్లై దేశీయ పంటల నుంచే ఉంటోంది. కాబట్టి, యునైటెడ్ స్టేట్స్‌లో వినియోగించే బియ్యంలో అతి కొద్ది భాగం మాత్రమే నిషేధం వల్ల ప్రభావితమవుతుంది.

అయితే, సోనామసూరి వంటి బాస్మతీయేతర బియ్యంపైనే ఆధారపడుతున్న స్టోర్లు, రెస్టారెంట్లు మాత్రం ఇబ్బందులు పడుతున్నాయి. బాస్మతీయేతర బియ్యానికి ప్రత్యామ్నాయంగా, బాయిల్డ్‌ రైస్‌తో ఏ ఫుడ్‌ ఐటెమ్స్‌ చేయవచ్చో రీసెర్చ్‌ చేస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: 

టాప్ హెడ్ లైన్స్

Gold Price Crash Expectations: బంగారం అమ్మేస్తున్న భారతీయ కుటుంబాలు.. మూడు నెలల్లో 50 టన్నుల విక్రయం.. ధరల క్షీణత భయమే కారణమా?
బంగారం అమ్మేస్తున్న భారతీయ కుటుంబాలు.. మూడు నెలల్లో 50 టన్నుల విక్రయం.. ధరల క్షీణత భయమే కారణమా?
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget