అన్వేషించండి

Tax Exemption: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి

ఏదైనా స్థలం, ఫోటో, వీడియో, వెబ్‌సైట్, టెక్స్ట్‌ మెసేజ్‌ లేదా QR కోడ్‌ను భౌగోళిక సమాచారంతో లింక్ చేయడాన్ని జియో ట్యాగింగ్ అంటారు.

Geotagging for Tax Exemption: ఇప్పుడు, ఆస్తి పన్నుకు సంబంధించి కొత్త రూల్‌ అమల్లోకి వచ్చింది. జియో ట్యాగింగ్ లేకుండా ఇకపై ఆస్తి పన్ను మినహాయింపు ప్రయోజనం (Tax Exemption Benifit) లభించదు. దేశ రాజధాని దిల్లీలో, MDC (Municipal Corporation of Delhi) ఈ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. 

దిల్లీలోని అన్ని రకాల ఆస్తులకు కొత్త రూల్‌ వర్తిస్తుంది. జియో ట్యాగింగ్‌తో (Geotagging), ఒక ఆస్తి ప్రస్తుతం ఉన్న స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి వీలవుతుంది. ఆస్తి పన్ను చెల్లింపుదార్లు (Property Tax Payers), వారి UPIC (Unique Property Identification Code) నుంచి, ఆస్తి ఉన్న ప్రస్తుత స్థానాన్ని ఎంచుకోవాలి. తద్వారా సులభంగా జియో ట్యాగ్‌ జరుగుతుంది.

ఆస్తుల జియో ట్యాంగింగ్‌కు డెడ్‌లైన్‌
దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఆస్తులకు జియో ట్యాంగింగ్‌ కోసం 2024 జనవరి 31వ తేదీని డెడ్‌లైన్‌గా (deadline for geotagging of property) విధించింది. వీలైనంత త్వరగా ఆస్తులను జియో ట్యాగ్ చేయాలని అందరినీ రిక్వెస్ట్‌ చేసింది. ప్రాపర్టీ యజమానులు తమ ప్రాపర్టీలను జియో ట్యాగ్ చేయకపోతే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 10 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ ఎగ్జమ్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోలేరని ఎంసీడీ తేల్చి చెప్పింది. జియో ట్యాగ్‌ వల్ల, GIS (Geographic Information System) మ్యాప్‌లో ఆ ఆస్తి ఉన్న ఖచ్చితమైన అక్షాంశం, రేఖాంశం తెలుస్తాయి.

MCD యాప్ లేదా ఆన్‌లైన్ పోర్టల్ సాయం
MCD యాప్ లేదా ఆన్‌లైన్ పోర్టల్ సాయంతో జియో ట్యాగింగ్‌ పనిని సులభంగా చేయవచ్చు. తద్వారా, ప్రతి ఆస్తికి సంబంధించిన ఖచ్చితమైన స్థానం MCDకి అర్ధం అవుతుంది. ఆస్తిని ఇప్పటికే జియోట్యాగింగ్ చేస్తే, మళ్లీ చేయవలసిన అవసరం లేదు. 

జియో ట్యాగింగ్ అంటే ఏమిటి? (What is geotagging?)
ఏదైనా స్థలం, ఫోటో, వీడియో, వెబ్‌సైట్, టెక్స్ట్‌ మెసేజ్‌ లేదా QR కోడ్‌ను భౌగోళిక సమాచారంతో లింక్ చేయడాన్ని జియో ట్యాగింగ్ అంటారు. దీన్ని బట్టి ఆ ప్రదేశం ఎక్కడుందో కచ్చితంగా తెలిసిపోతుంది. సమయంతో సహా ఇతర సమాచారాన్ని కూడా దీనికి యాడ్‌ చేయవచ్చు. ఫోటో లేదా వీడియోను జియో ట్యాగ్ చేస్తే... అది ఎక్కడ, ఏ సమయంలో తీశారో మనం తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పుడు జియో ట్యాగింగ్ వినియోగం బాగా పెరిగింది. 

జియో ట్యాగింగ్ ప్రభుత్వాలకు కూడా చాలా ముఖ్యం. దీని ద్వారా, నిరిష్ట ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవచ్చు. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించవచ్చు. జియో ట్యాగింగ్ అన్ని రకాల కంపెనీలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్‌ ఉన్నాయి. జియో ట్యాంగింగ్‌తో వినియోగదారు ఏ బ్రాండ్స్‌, సంస్థలు, ఆఫర్లపై ఆసక్తి చూపుతున్నాడో సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, కన్జ్యూమర్‌ ఇష్టాలు & అయిష్టాలు కూడా కంపెనీలకు తెలుసుస్తాయి.      

మరో ఆసక్తికర కథనం: మళ్లీ పెరిగిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Embed widget